మహ్మద్ ప్రవక్తపై వివాదం ముస్లిం నేతలను ఏకం చేస్తోంది. ఈ వివాదంలో బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం నేతలంతా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. గుంటూరులోని ఆంధ్రా ముస్లిం కళాశాలలో ముస్లింల ఐక్యత రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. పార్టీలకు అతీతంగా ముస్లిం నేతలంతా తమ సమస్యలపై చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ ముస్తాఫా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలి, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని ఈ సదస్సుకు హాజరయ్యారు.


ఇదే సమావేశంలో ముస్లిం ఐక్య వేదికను ఈ నేతలు ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షునిగా జియావూర్‌ రెహ్మాన్‌ను ఎన్నుకున్నారు. రాజకీయాలకు అతతీతంగా ముస్లింలంతా ఐకమత్యంతో మెలగాలని.. ఏకతాటిపైకి రావాలని నిర్ణయించారు. ఈ ముస్లిం నేతల కీలక సదస్సు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: