చందమామ అంటే మనిషికి ఎప్పుడూ ఆసక్తికరమే.. వెన్నెలను ఆస్వాదిస్తూ.. ఆ చందమామ రహస్యాలను తెలుసుకోవాలని మనిషి ఎప్పటి నుంచో ఆశపడుతున్నాడు. ఈ దిశగా అమెరికా సంస్థ నాసా చేసిన ఆర్టెమిస్‌ ప్రయోగం విజయవంతమైంది. నాసా ప్రయోగించిన అంతరిక్షనౌకలోని ఓరియాన్‌ స్పేస్‌ క్యాప్స్యూల్‌ దిగ్విజయంగా చంద్రుడి ఉపరితలంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ కక్ష్య చంద్రుడి ఉపరితలానికి కేవలం 130కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుందని నాసా తెలిపింది.


అపోలో మిషన్‌ జరిగిన 50ఏళ్ల తర్వాత స్పేస్‌ క్యాప్య్సూల్‌  రెండోసారి చంద్రుడిని చేరిందని నాసా తెలిపింది. క్యాప్స్యూల్‌ చంద్రుడిని చేరిన సమయంలో సుమారు 30నిమిషాల పాటు ఓరియాన్‌తో నాసాకు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడు భూమికి కనిపించే వ్యతిరేక తలంలో క్యాప్స్యూల్‌ పరిభ్రమించింది. అక్కడి నుంచి క్యాప్స్యూల్‌లో అమర్చిన కెమెరా..3లక్షల 70వేల కిలోమీటర్ల దూరంలోని భూమిని చిత్రించి ఆ ఫోటోలు నాసాకు పంపింది. ఓరియాన్‌ క్యాప్స్యూల్‌ పంపిన దృశ్యాల్లో భూమి చిన్న గోళంలా  నీలం రంగులో కనిపించింది..


మరింత సమాచారం తెలుసుకోండి: