మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి  అన్నారు. అడ్డంకులు అన్నీ అధిగమించాకే మూడు రాజధానుల పై  ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుందని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. అమరావతి లో రైతుల భూముల అభివృద్దిపై హైకోర్టు గతంలో నిర్దిష్ట కాలపరిమితి విధించిందని, నిర్దిష్ట కాలపరిమితి విధిస్తూ  హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినట్లు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి  తెలిపారు.


అమరావతిలో తన బినామీ లను భూములను కాపాడుకోవాలనే తాపత్రయంతో చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి  ఆరోపించారు. అమరావతిలో భూముల ధరలు పడిపోకుండా ఉండేందుకు తన బినామీలతో  చంద్రబాబు ఆందోళన చేయిస్తున్నారని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి  విమర్శించారు. అమరావతిపై చంద్రబాబు సృష్టించిన అన్ని అడ్డంకులన్నీ త్వరలో  తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: