ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసింది. కొత్త జట్టును ప్రకటించింది. అయితే.. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన పీసీసీ కార్యనిర్వాహక, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనిపించలేదు. ఇది పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది.


ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి  వ్యహరించిన తీరు ఇందుకు కారణంగా తెలుస్తోంది. మునుగోడు సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంపై  అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్తు తెలుస్తోంది. అంతే కాదు.. ఆ సమయంలో ఆయనకు షోకాజు నోటీసు కూడా ఏఐసీసీ జారీ చేసింది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు కోమటిరెడ్డి అంటీముంటనట్లు వ్యహరిస్తూ వచ్చారు. ఆయన  వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ కారణాలతోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిన కమిటీల్లో ఆయన చోటు కల్పించలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: