తెలుగుదేశం ఏనుగు లాంటిదని.. పరిగెత్తడం మొదలుపెడితే ఆగదని నారా లోకేష్‌ అన్నారు. తాము అధికారంలోకి రాగానే తప్పు చేసిన ప్రతి అధికారి పై న్యాయవిచారణకు ఆదేశిస్తామని నారా లోకేష్‌ తెలిపారు. ఇకపై రెడ్ డైరీ తో పాటు రెడ్ ఫోన్ కూడా సిద్దమవుతోందని.. సైకో జగన్ ఆటలు ఎంతో కాలం సాగవని నారా లోకేష్‌ అన్నారు. ప్రజలకు అన్నీ అర్ధమవుతున్నాయని.. జగన్ పై ప్రజలు కసితో ఉన్నారని నారా లోకేష్‌ అన్నారు.

 
చంద్రబాబు కు క్రెడిబిలిటీ ఉంది కాబట్టే  ప్రజలంతా కదిలి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని నారా లోకేష్‌ అన్నారు. నిరసనల్లో టీడీపీ వాళ్ళ కన్నా సామాన్య ప్రజలే ఎక్కువగా ఉన్నారని.. అన్ని వర్గాల ప్రజలు నిరసన తెలుపుతున్నారని నారా లోకేష్‌ అన్నారు. ఒక్క ఆధారం కూడా చూపకుండా చంద్రబాబును జైల్లో పెట్టడమే నా మనస్సును బాధిస్తోందన్న నారా లోకేష్‌.. ప్రజాగ్రహం చూసి సైకో జగన్ కి వణుకు పుడుతోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: