యాంకరింగ్.. టీవీ చూస్తున్నప్రేక్షకులను కనికట్టు చేసే విద్య. కొన్ని కార్యక్రమాలు కేవలం యాంకర్ల ద్వారానే పాపులర్ అవుతాయి. ఇక క్రికెట్ యాంకరింగ్.. అదేనండీ కామెంటరీ.. ఇది మరో ప్రత్యేక నైపుణ్యం అవసరమైన కళ. సాధారణంగా సీనియర్ ఆటగాళ్లే కామెంటేటర్లగా అవతారం ఎత్తుతారు.


ఇప్పుడు ఈ కామెంటేటర్లు సంపాదిస్తున్న ఆదాయం లెక్కలు చూస్తే కళ్లు తిరగడం ఖాయం. ఒక్కోసారి ఆటగాళ్ల కంటే వ్యాఖ్యాతలకే ఎక్కువ ఆదాయం వస్తుంది కూడా. ప్రస్తుతం మన భారత సీనియర్లలో సంజయ్‌ మంజ్రేకర్‌, హర్ష భోగ్లె, సునీల్‌ గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సెహ్వాగ్‌ బాగా కామెంటర్లుగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు.


ఇక వీరి సంపాదన లెక్కలు చూస్తే... రవిశాస్త్రి ముందున్నాడు. అతడు ఒక్కో సిరీస్‌కి సుమారు రూ.60 లక్షలు అందుకున్నాడు. ఐపీఎల్‌ టోర్నమెంట్లకు రూ.4 కోట్లు తీసుకునేవాడట. మొత్తం మీద ఏడాదికి కామెంట్రీ ద్వారా సుమారు 7 కోట్లు సంపాదించాడట. ప్రస్తుతం సంజయ్‌ మంజ్రేకర్‌, సునీల్‌ గవాస్కర్‌ బాగా సంపాదిస్తున్నారట. ఈ ఇద్దరి ఆదాయం ఏడాదికి దాదాపు రూ.6కోట్లు.


యావరేజ్ మీద.. మన కామెంటేటర్లకు ఒకరోజు ఫీజుగా సుమారు రూ.2 లక్షలు ఇస్తున్నారట. మనవాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు ఐపీఎల్‌... ఇతర మ్యాచ్‌ల ద్వారానూ ఎక్కువ సంపాదిస్తున్నారట. మదీ మన మాజీ ఆటగాళ్ల సంపాదన కథ.


మరింత సమాచారం తెలుసుకోండి: