ప్రస్తుతం మన దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి విధితమే. అయితే ఈ కరోనా మహమ్మారి సమయంలో... కోవిడ్ హాస్పిటల్ పేరు వింటేనే గజ గజ వణుకుతూ ఉన్నారు జనాలు. మన దురదృష్టవశాత్తు కరోనా సోకి ఆస్పత్రి పాలైతే... మనల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని చూస్తూ ఉంటాం. సామాజిక దూరం, మాస్కులు ధరించడం ఇలాంటి రూల్స్ అన్ని కరోనా ఆస్పత్రుల్లో తప్పనిసరి చేశారు. అయితే ఇలాంటి కరోనా ఆసుపత్రిలో కొన్ని పరిస్థితులు చూస్తుంటే.. ప్రతి ఒక్కరూ షాక్ కావాల్సిందే. కరోనా ఆస్పత్రుల్లో.. వైద్యం సరిగా చేయకపోవడం, అసలు కరోనా వ్యాధి గ్రస్తులను పట్టించుకోవడం.. ఇవన్నీ ఆసుపత్రుల్లో కామన్ అయిపోయాయి. అయితే తాజాగా దీనికి తోడు మరో సమస్య వచ్చి పడింది. కరోనా ఆస్పత్రుల్లో విచ్చలవిడి సెక్స్, సినిమా స్టైల్ ఫైట్ సీన్లు మరియు మాదకద్రవ్యాల వినియోగం లాంటివి ఆ హాస్పిటల్ లో కామన్ అయ్యాయట. 

మరీ ముఖ్యంగా ఆ ఆస్పత్రి... కరోనా ఆస్పత్రి కావడం గమనార్హం. ఈ విషయం వినడానికి నమ్మశక్యం కాకపోయినా... ఇదే అసలు నిజం. కాకపోతే ఈ ఘటన మన ఇండియాలో జరగలేదు. ఈ దారుణ ఘటన బ్యాంకాక్ లోని.... సాముత్ ప్రకన్ రాష్ట్రంలోని కరోనా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఈ ఆసుపత్రిలో మొత్తం ఐదు భవనాలు ఉండగా వెయ్యి మందికి పైగా రోగులు ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రి లో జరిగే వైద్యం గురించి ఏమో కానీ... అందులో చికిత్స పొందుతున్న రోగులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారట. కరోనా మహమ్మారి సోకి ఆ ఆసుపత్రిలో చేరిన కొంతమంది వ్యాధిగ్రస్తులు.. రచ్చ రచ్చ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ కరోనా రోగులు విచ్చలవిడిగా శృంగారం లో పాల్గొంటున్నారు.

అంతేకాదు విపరీతంగా మాదకద్రవ్యాలు వాడుతూ రెచ్చి పోతున్నారట. అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నా కరోనా రోగుల బాగోతం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇంకేం కరోనా ఆస్పత్రిలో ఆ వ్యాధిగ్రస్తులు చేస్తున్న ఆ ఎంజాయ్ ఫుటేజ్ చూసిన ఆసుపత్రి సిబ్బంది కూడా అవాక్కయ్యారట. అక్కడితో ఆగకుండా  గ్రూపులుగా విడిపోయి... కరోనా రోగులు ఫైటింగ్ సీన్లు కూడా చేస్తున్నారట. వీటన్నిటిని చూసిన ఆస్పత్రి అధికారులు.. ఏం చేయాలో తోచక తలలు పట్టుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆస్పత్రిలో ఉన్న పురుషులు మరియు మహిళలను విభజించి ప్రత్యేకమైన వార్డుల్లో ఉంచారట ఆస్పత్రి సిబ్బంది. అంతే కాదు ఇలాంటి  ఘటనలు మరోసారి చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... మాదక ద్రవ్యాల పై దర్యాప్తు చేపట్టారు. వీరికి ఎవరు మాదకద్రవ్యాలు సప్లై చేస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: