ఓ వ్యాపారి కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన ఆ వ్యక్తి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఆత్మహత్యకు పాల్పడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ నగరంలోని గంగాస్థాన్‌ ఫేజ్‌-2 పరిధిలో ఉన్న శ్రీచైతన్య అపార్ట్‌మెంట్‌లోని 207 ఫ్లాట్‌లో నివాసముంటున్న పప్పుల సురేశ్‌ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ వ్యాపారికి ఆయనకు భార్య శ్రీలత (43), కొడుకులు అఖిల్‌ (26), ఆశిష్‌ (22) ఉన్నట్లు సమాచారం. అయితే సురేశ్‌ స్థానికంగా ఓ పెట్రోల్‌బంక్‌ను లీజ్‌ కు తీసుకొని దానిని నడిపిస్తూ వ్యాపారం చేస్తున్నారు.

అయితే మూడేండ్ల క్రితం వరకు ఓ మెడికల్‌ దుకాణం నడిపిన సురేశ్‌.. అనుకోని పరిస్థితుల్లోషాప్ ని మూసివేశాడు. ఇక ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టిపెట్టిన ఆయన.. కుటుంబ పోషణ కోసం పరిచయస్తుల వద్ద అప్పులు చేస్తూ వచ్చారు. అంతేకాదు.. గత ఏడాది సుభాష్‌నగర్‌లోని ఓ పెట్రోల్‌ బంకును అద్దెకు తీసుకున్న సురేశ్‌.. పెద్దకొడుకు అఖిల్‌కు దాని నిర్వహణను అప్పగించినట్లు సమాచారం. ఆయన చిన్న చిన్నకొడుకు ఆశిష్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. ఆ కుటుంబం బాకీలు తీర్చే క్రమంలో చేసిన అప్పులువారిని మరింత ఊబిలోకి నెట్టేశాయి.

ఈ నేపథ్యంలో తమ ఫ్లాట్‌పై పిరామిల్‌ క్యాపిటల్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ సంస్థ వద్ద లోన్‌ తీసుకున్నాడు. ఇక వాళ్ల వేధింపులు తీవ్రమవడంతో ఐదురోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లారు. వారు వాయిదా చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ సంస్థ ఇంటికి నోటీసులు అంటించారు. ఈ విషయం తెలుసుకున్న సురేశ్‌ తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు.

దీంతో ఆ కుటుంబం సభ్యులు విజయవాడ కనకదుర్గ ఆలయం చేరుకొని అక్కడి ఆర్యవైశ్య సత్రంలో పెద్ద కొడుకు అఖిల్‌ పేరిట గదిని అద్దెకు తీసుకున్నాడు. వారికీ పెరిగిపోయిన అప్పులతో పరువుపోవడం, దారితెన్నూ కనిపించకపోవడంతో కుమారులతో కలిసి సురేశ్‌, శ్రీలత ఆత్మహత్యకు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే తాము చనిపోతున్నాము అంటూ బంధువుల ఫోన్లకు మెసేజ్ పెట్టారు. తాము అప్పుల బాధ తాళలేక చనిపోతున్నామంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: