సమాజంలో రోజురోజుకు అక్రమార్కులు పెరిగిపోతున్నారు. ప్రభుత్వం వారికి అందిస్తున్న  జీతాలు  చాలవన్నట్టు  ఇలా ప్రజలను మోసం చేస్తూ  రెండు చేతుల సంపాదిస్తున్నారు. బాధ్యతగల వృత్తిలో ఉండి కూడా ఇలాంటి పనులు చేయడానికి  వారికి మనకు ఎలా ఒప్పుతుందో కానీ  చాలా దారుణమైన లంచాలకు అలవాటు పడుతున్నారు. పది మందికి చెప్పే వృత్తిలో ఉండి వారే దారి తప్పితే మిగిలిన వారి పరిస్థితి ఏంటి.. బాధ్యతగా నకిలీ మద్యాన్ని, గంజాయి, సారాయి లాంటి మత్తుపానీయాలు నుండి ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉంది పోయి అతనే కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వం నుంచి వచ్చే టువంటి మద్యాన్ని పక్కదారి  పట్టించి ఎక్సైజ్ అన్న పదానికే మాయని మచ్చలా తయారయ్యారు. ఇక వీరు పేద వారి ప్రాణాలకు ఏ విధమైన భరోసా ఇస్తారు. మరి ఈ ఎక్సైజ్ అధికారులు   చేసిన తప్పేంటో తెలుసుకుందామా..?

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్స్ పై కేసు నమోదు చేసినటువంటి ఘటన చాలా విచిత్రంగా ఉంది. సదరు అధికారులు ఒక బార్ లో దౌర్జన్యానికి దిగారని దీంతో ఎక్సైజ్ సీఐ జవహార్ మరియు ఎస్సై సురేష్ బాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ కేంద్రంలోని ఆనంద్ బార్ అండ్ రెస్టారెంట్  అనధికారంగా యాజమాన్య వాటాలను జవహర్ కొనసాగించారు. అయితే ఈ యొక్క లావాదేవీల విషయంలో బార్ లీజుకు తీసుకున్న శివతో జవహర్ గొడవపడ్డారు.

 దీంతో ఎస్ ఐ మరియు మరో 30 మందిని వెంట వేసుకొని సీఐ జవహర్ దౌర్జన్యానికి ఒడిగట్టారు. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బారును తీసుకున్న శివ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిగినటువంటి పోలీసులు ఎక్సైజ్ అధికారులపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే మద్యాన్ని గొడవ నుండి అక్రమంగా పెద్ద మొత్తంలో బార్ కు వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు నిందితుడు ఇద్దరిని అరెస్టు చేసి డిమాండ్ చేసినట్టు ఎస్ ఈ బి అదనపు ఎస్పి విద్యాసాగర్ మీడియాతో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: