సాధారణంగా పోలీస్ అన్న తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇక ప్రతి విషయంలో కూడా  ఆలోచించి పని చేయాలి. ఇక అందరు పోలీసులు ఇలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ  సమాజంలో శాంతిభద్రతలు ఉండేలా చూసుకుంటూ ఉంటారు.. కానీ కొంతమంది పోలీసులు మాత్రం వ్యవహరించే తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకును వీధి కుక్క బెదిరించింది అన్న కారణంతో ఆ పోలీసు ఆగ్రహంతో ఊగిపోయాడు.


 దీంతో ఇక ఆ వీధి కుక్క పట్ల కనీసం జాలి దయ చూపించకుండా ఏకంగా విచక్షణ కోల్పోయి బేస్బాల్ బ్యాట్ తో కుక్కను చితకబాది దారుణంగా చంపేసాడు. సెక్టార్ 44 లోని చెల్లె రా గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఆవూరు జిల్లాకు చెందిన వినోద్ కుమార్  కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతని చిన్న కొడుకు పక్కింటి మీదుగా వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న ఒక వీధి కుక్క తరచూ అరుస్తూ చిన్న కొడుకుని భయపడేలా చేస్తూ ఉండేది. ఓ రోజు ఈ విషయాన్ని గ్రహించాడు సదరు కానిస్టేబుల్. ఇక తన కొడుకును చూసి అరుస్తున్న కుక్క తో ఇది ఎప్పుడైనా హాని కలిగించవచ్చు అని భావించాడు.


 ఈ క్రమం లోనే సదరు కుక్కను చంపేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమం లోనే ప్లాన్ ప్రకారం ఇక బేస్బాల్ బ్యాటుతో కుక్కను దారుణంగా చంపేశాడు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత ఢిల్లీ కానిస్టేబుల్ కుటుంబానికి స్థానికులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఈ గొడవ సద్దుమణిగేలా చేశారు. కానిస్టేబుల్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 429 ప్రకారం కేసు నమోదు చేసుకొని అతన్ని అరెస్టు చేశారు ఈ విషయాన్ని నోయిడా పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: