ఈ భూమ్మీద నూకలు బాకీ ఉండాలి కానీ ఎలాంటి ప్రమాదం నుంచి బయట పడి ప్రాణాలు దక్కించుకోవచ్చు అని చెబుతూ ఉంటారు. కొన్ని రకాల సంఘటనలు చూసిన తర్వాత ఇది నిజం అని నమ్మకుండా ఉండలేరు ఎవరైనా. అదే సమయంలో భూమి మీద నూకలు తినే బాకీ లేనప్పుడు ఎలాగైనా  ప్రాణాలు పోతాయి అని చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి ఘటనలు కూడా ఇప్పటివరకు ఎన్నో తెరమీదకు వచ్చాయి. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యమైన ఘటనలు  ఎంతో మంది ప్రాణాలను తీసే స్తూ ఉంటాయి.


 అంతేకాదు ఇక ఎన్నో కుటుంబాల్లో  విషాదాన్ని నింపుతూ ఉంటాయి అని తెలిసింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. స్నేహితులు అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆడుకున్నారు. ఇంతలో వారి మనసులో ఒక ఆలోచన తట్టింది. వెంటనే చెరువు లోకి వెళ్లి ఈత కొడితే ఎంత బాగుంటుంది అని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే స్నేహితులు అందరూ కలిసి చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. కానీ అక్కడ వారి కోసమే మృత్యువు వేచి చూస్తోంది అన్న విషయాన్ని గ్రహించలేకపోయారు.



 చివరికి చెరువులో ఈత కొడుతూ నీటమునిగి ముగ్గురు మృతి చెందడంతో ఇక వారి కుటుంబ సభ్యులు అరణ్యరోదనగా విలపించారు అనే చెప్పాలి. ఈ ఘటన హైదరాబాదులోనే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. మల్కారం  చెరువులో ఈతకు వెళ్లి 12 సంవత్సరాలు వయసు ఉన్న ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. స్థానికుల సమాచారంతో స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మొత్తం ఆరు మంది విద్యార్థులు ఈతకు వెళ్ల గా ముగ్గురు మృతి చెందారని తెలుసుకున్న పోలీసులు ఇక అతి కష్టం మీద రెండు మృతదేహాలను వెలికి తీయగలిగారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: