ఇటీవలి కాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలనీ అవగాహన చర్యలు చేపట్టిన వాహనదారులు తీరులో మార్పు రాకపోవడంతో చివరికి భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇక వాహనదారులకు షాక్ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఇలా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న సమయంలో రాజకీయ నాయకులు, అధికారులు మాకు తెలుసు అంటూ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాహనదారులు.


 ఇక ఇలాంటివి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఎన్నో సార్లు జరుగుతూ ఉంటాయి. మేం ఫలానా రాజకీయ నాయకులకు సంబంధించిన అనుచరులం అంటూ చెబుతూ ఉంటారు. ఏకంగా పోలీసులకు ఎదురు తిరగడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఎమ్మెల్యే అనుచరులం అంటూ చెప్పిన కొంతమంది వ్యక్తులు ఇటీవలే జూబ్లీహిల్స్ లో హంగామా సృష్టించారు. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 2 లో పార్క్ హయత్ హోటల్ ముందు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి ఒక కారు చేరుకుంది.  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 151 పాయింట్లు వచ్చింది. అయితే అతను కేశంపేట కు చెందిన వ్యాపారి కిరణ్ కుమార్ రెడ్డి గా గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలోనే అతని బంధువులు శ్రీధర్ రెడ్డి,హనుమంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. తాము ఎమ్మెల్యే మనుషులని వెంటనే కార్ ఇచ్చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లేదంటే ఇక సస్పెండ్ చేస్తామని బెదిరించారు... చివరికి  ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో తాగినట్లు నిరూపణ అయిన కిరణ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: