ఒకవైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరో వైపు వివిధ రకాల ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాల ను కొల్పొతున్నారు. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇలా ఏదొక ప్రమాదం వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఏపీలో మొన్నీమధ్య జరిగిన ప్రమాదం గురించే తెలిసిందే.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం లో ఏడుగురు చనిపోయినట్లు తెలుస్తుంది.. ఈ ఘటన తో స్థానికంగా కలకలం రేపుతోంది.. కనురెప్ప పాటు కాలంలో జరిగిన ప్రమాదం వల్ల అందరు నిరాశ లో వున్నారు.
 

వివరాల్లొకి వెళితే.. ఏపీలో ఏలూరు లో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది.జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమ లో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్‌-4లో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలిపోయింది. మంటల ధాటికి ఏడుగురు మంది చనిపోయినట్లు తెలుస్తుంది. స్పాట్ లో ఐదుగురు చనిపొయారు, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు..13 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం..


ప్రమాదం జరిగిన వెంటనే మొదట నూజివీడు ఆసుపత్రి కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ కు తీసుకెళ్లారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలి కి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.. మంటలు వేగంగా వ్యాపించాయి. దాంతో లోపల ఉన్న వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు గంట పాటు శ్రమించి మంటల ను ఆర్పారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 50 మంది ఉన్నట్లు తెలుస్తుంది.. మరింత సమాచారం తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: