రెండు మనసుల మధ్య ప్రేమ పుట్టడం కేవలం క్షణకాలం లో జరిగే ప్రక్రియ. కానీ ఆ ప్రేమ ఎన్నో ఏళ్ల పాటు కొనసాగుతుంది అన్నది మాత్రం ఆ ఇద్దరి బంధం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రేమ అంటే మధురానుభూతి ప్రేమ అంటే జ్ఞాపకం ప్రేమ అంటే మాటల్లో వర్ణించలేనిది చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఇక ఇలాంటి ప్రేమలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రేమ అంటే మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారి పోయింది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. వాట్సాప్ లో ఆ ఇద్దరికీ పరిచయం అయింది. కొద్ది రోజులకే స్నేహితులుగా కూడా మారిపోయారు. ఎంతలా అంటే రోజూ వీడియో కాల్ చేసుకోకుండా ఒకరిని ఒకరు చూసుకోకుండా ఉండలేనంతగా.


 ఇక స్నేహితుడే కదా అని సదరు యువతి అతను చెప్పినట్లు ఆడింది. కానీ ఆ తర్వాత ఆ యువతి భోరున విలపించే పరిస్థితిని తీసుకువచ్చాడు. దీంతో న్యాయం చేయాలంటూ సదరు యువతి పోలీసులను ఆశ్రయించే పరిస్థితి వచ్చింది.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల మహిళ కు వివాహం అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. గత ఏడాది ఒక వాట్సాప్ నెంబర్ నుంచి సదరు మహిళకు  మెసేజ్ వచ్చింది. యోగేంద్ర అనే వ్యక్తి మంచి మెసేజ్ రాగా రిప్లై ఇచ్చింది.  ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త స్నేహితులుగా మారిపోయేలా చేసింది.


 ప్రతి రోజూ చాటింగ్ చేయడం వీడియో కాల్ చేసుకోవడం వీరిద్దరి మధ్య కామన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల స్నానం చేసేందుకు బాత్రూం లోకి వెళ్ళిన సమయంలో వీడియో కాల్ కావాలంటూ యోగేందర్ కుర్రాడు దీంతో కాదనకుండా వీడియోకోరాడూ. కాదనకుండా కాల్ చేసింది మహిళ. ఇక ఆ దృశ్యాలను యోగిందర్ రికార్డ్ చేసి వీడియో క్లిప్ ను అడ్డం పెట్టుకుని మహిళలను వేధించడం మొదలుపెట్టాడు.  పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే వీడియో లీక్ చేస్తానంటూ హెచ్చరించాడు.. ఈ విషయం తన సోదరికి చెప్పుకొని  బాధపడింది మహిళ. సోదరి ధైర్యం చెప్పడంతో ఇక యోగిందర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్లాన్ ప్రకారం యోగిందర్ ను హోటల్ కి రమ్మని పిలిచింది సదరు మహిళ. అక్కడికి వెళ్ళి చూసేసరికి పోలీసులు ఉన్నారు. ఇక అతన్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: