ప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులు సమ్మేళనం అని చెబుతూ ఉంటారు. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత ఈ లోకాన్ని మరిచిపోతారు ప్రేమికులు అని అంటూ ఉంటారు. నిజంగానే నేటి రోజుల్లో కూడా ఎంతో మంది యువతులు ప్రేమలో పడిపోయిన తరువాత ఈ లోకాన్ని మరిచిపోతున్నారు. ముఖ్యంగా యువతులు ప్రేమించిన వారిని గుడ్డిగా నమ్మి సర్వస్వం అర్పిస్తున్నారు. కానీ నువ్వే ప్రాణం అంటూ వెంటపడిన ప్రియుడి నిజ స్వరూపం తెలిసి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. నేటి రోజుల్లో ఎంతోమంది ప్రేమ పేరుతో మోసపోతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.


 అవసరాలకు వాడుకునేందుకు ప్రేమ అనే ముసుగు వేసుకుని మాయ మాటలతో నమ్మించి ప్రేమలోక దింపుతున్నారు ఎంతోమంది మోసగాళ్లు. చివరికి  అన్ని రకాల అవసరాలు తీరిన తర్వాత నడిరోడ్డు మీద వదిలేస్తున్నారు.. ఇలాంటి ఈ తరహా ఘటన జరిగింది ఇక్కడ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండుసార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని కోరితే చివరికి కులం పేరుతో తిరస్కరించాడు. దీంతో న్యాయం చేయాలంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. విజయ నగర్ కు చెందిన యువతికి ప్రాంతానికి చెందిన గణేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళకే పరిచయం ప్రేమగా మారింది.


 అయితే మనం పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుదాం అంటూ గణేష్ సదరు యువతిని మాయమాటలతో నమ్మించాడు.  శారీరక వాంఛలు కూడా తీర్చుకున్నాడు. అయితే చివరికి గర్భం దాల్చాక అబార్షన్ చేయించాడు. పెళ్లికి నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకసారి కేసు నమోదు చేసి జైలుకు పంపించారూ. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మార్పు రాలేదు. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. మరోసారి యువతి గర్భం దాల్చగా  పెళ్లి చేసుకోమని అడిగింది. దీంతో కోపంతో ఏకంగా ఆమె నడుము మీద తన్నడం తో  గర్భస్రావం అయింది.. ఎట్టి పరిస్థితుల్లో గణేష్ తో పెళ్లి చేసి న్యాయం  చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిందియువతి.

మరింత సమాచారం తెలుసుకోండి: