దేశవిదేశాలలో బంగారం అక్రమంగా స్మగ్లింగ్ చేయడం లో అటు అక్రమార్కులు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు అన్న విషయం తెలిసిందే   ఎప్పుడూ ఏదో ఒక విధంగా స్మగ్లింగ్కు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఎయిర్ పోర్టులో అటు కస్టమ్స్ అధికారులు కూడా ఎక్కువగా నిఘా ఏర్పాటు చేసి అక్రమార్కులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోస్తున్నారూ. అయినప్పటికీ ఇలాంటి అక్రమాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు అని చెప్పాలి. విగ్గులు సాక్సులు లోదుస్తులు మలద్వారం ఇలా చెప్పుకుంటూ పోతే  బంగారం స్మగ్లింగ్ చేయడానికి ఇప్పటివరకు చాలా దారులనే ఎంచుకున్నారు స్మగ్లర్లు.


 శతకోటి దరిద్రాలకు అనంత  కోటి ఉపాయాలు అన్నట్లు కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పి ఇక అక్రమాలకు పాల్పడేందుకు ఇలాంటి అవకాశం ఎన్ని ఉన్నా అసలు వదులుకోవడం లేదు అని చెప్పాలి.. దీంతో అటు ఎయిర్పోర్టులో బంగారం అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారిపోయింది. ఇక కస్టమ్స్ అధికారులు బంగారాన్ని పట్టుకుని సీజ్ చేయడం కూడా సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి.ఈ క్రమంలోనే ఎవరికీ అంతుచిక్కని మార్గాలను ఎంచుకునేందుకు కేటుగాళ్లు ఎప్పుడూ కొత్తగానే ఆలోచిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశాల నుంచి అక్రమంగా తీసుకువస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.


 దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి దగ్గర నుంచి ఏకంగా 1.2 కోట్ల విలువైన 2290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక హీరో సూర్య నటించిన వీడొక్కడే సినిమా తరహాలో ఇక్కడ పట్టుబడ్డ నిందితుడు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఏకంగా సూట్కేసులు లోని రాడ్ లలో దాచుకుని బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో బంగారం స్వాధీనం చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనా కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: