సాధారణంగా మరణించాడు అనుకున్న వ్యక్తి తిరిగి ప్రాణాలతో లేచి కూర్చోవటం సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే కలికాలం వల్లనో లేదా ఇంకా ఏదైనా కారణాల వల్ల తెలియదు కానీ.. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో నిజజీవితంలో కూడా జరుగుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఒక వ్యక్తి చనిపోయాడు అని అతని చుట్టూ చేరి కుటుంబ సభ్యులు అందరూ కూడా రోధిస్తున్న సమయంలో సదరు వ్యక్తికి ప్రాణం రావడం.. అది గమనించి వెంటనే అతని ఆస్పత్రిలో చేర్పించగా అతడు మళ్లీ బ్రతికి బట్ట కట్టడం లాంటివి లాంటివి ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.


 ఇక ఇప్పుడు అంతకుమించి అనే రేంజ్ లోనే ఒక విచిత్రమైన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు అని కుటుంబ సభ్యులు అందరూ కూడా అంత్యక్రియలు నిర్వహించారు. అతను పోయిన బాధ నుంచి మెల్లిమెల్లిగా బయట పడుతున్నారు.ఇలాంటి సమయంలో అంత్యక్రియలు జరిగిన నలభై ఒక్క రోజుల తర్వాత చనిపోయిన వ్యక్తి తిరిగి రావడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన ఎక్కడో కాదు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లో వెలుగులోకి వచ్చింది.  ముళ్లపాడు గ్రామానికి చెందిన సయ్యద్ మియా అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పని చేసేవాడు.


 మద్యానికి బానిసగా మారిపోయిన నేపథ్యంలో సొంత వూరికి వచ్చాడు. ఒక లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు.  ఇతనికి భార్య కుమార్తె ఉన్నారు. అయితే తరచూ తాగొచ్చి భర్తతో గొడవపడుతూ ఉండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. సయ్యద్ మియా ఎప్పుడు బయటికి పనికి వెళ్ళిన మూడు నెలల తర్వాత ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల 40 రోజుల క్రితం మార్కాపురం రైల్వే స్టేషన్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా.. అతను సయ్యద్ మియ్య లాగే కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ సయ్యద్ మియ్య అని నిర్ధారించుకుని అంత్యక్రియలు జరిపించారు.. ఇక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అంత్యక్రియలు జరిపిన 41 రోజుల తర్వాత అతడు ఇంటికి తిరిగి రావడంతో ఇక అప్పుడు అంత్యక్రియలు జరిపించింది సయ్యద్ మియ్యకు కాదని.. కుటుంబ సభ్యులకు అర్థమైంది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: