సాధారణంగా చిన్న వయసులో ఉన్నప్పుడు విద్యార్థులు నోట్లో ఏదో ఒకటి పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న వస్తువులను కూడా నోట్లో పెట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రమాదవశాత్తు నోట్లో పెట్టుకున్న చిన్న వస్తువులు గొంతు లోకి వెళ్లడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి సమయంలోనే చిన్న పిల్లల గొంతులో ఇరుక్కున్న వస్తువులు చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం తెచ్చి పెడుతూ ఉంటాయి. అందుకే ఎప్పుడుతల్లిదండ్రులు చిన్న పిల్లలను ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అని చెబుతూ ఉంటారు నిపుణులు.


 ఏది తప్పు ఏది ఒప్పు అన్నది చిన్న పిల్లలకు తెలిసి ఉండదు కాబట్టి వారు చేసే పనులు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయి. మరికొన్నిసార్లు ఇక పొరపాటున జరిగే పనులు ప్రాణాల మీదికి తెచ్చి పెడుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  ఒక విద్యార్థి నోట్లో గుండు సూది పెట్టుకొని ఆడుకోవడం మొదలు పెట్టాడు. కానీ ప్రమాదవశాత్తు పొరపాటున ఆ గుండు సూది ని మింగేసాడు. హోసూరు సమీపంలోని మోర్నపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఆనంద్, ధనలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు.  వారికి పన్నెండేళ్ల ఎల్లేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు.


 అయితే ఇటీవలే ఎప్పటిలాగానే పాఠశాలకు వెళ్లిన ఎల్లేష్ నోట్లో గుండు సూది పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ పొరపాటున మింగేశాడు. దీంతో ఒక్కసారిగా ఎల్లేష్ భయపడిపోయాడు. ఉపాధ్యాయులకు ఈ విషయం చెప్పాడు. కంగారు పడిన ఉపాధ్యాయులు వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ చేయగా గుండు సూది కడుపులో ఉన్న తేలింది. ఈ  క్రమంలోనే వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఇక చికిత్సకోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి కి పంపించడం గమనార్హం. ఇక తమ కొడుకు తొందరగా కోలుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: