వరు కట్నం తీసుకోవడం నేరం. కానీ ఇటీవల కాలంలో మాత్రం వరకట్నం సంప్రదాయం మాత్రం ప్రతి పెళ్లిలో కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పాలి. ఇక వధువు తల్లిదండ్రులు వరుడుకి భారీగా కట్న కానుకలు ముట్ట చెప్పడం లాంటివి నేటి రోజుల్లో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఇక అదనపు కట్నం కోసం వేధింపుల కారణంగా ఎంతో మంది నవవధువులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇంకొన్ని ఘటనల్లో ముందుగా మాట్లాడుకున్నంత కట్నం చెల్లించలేదు అన్న కారణంతో ఏకంగా పెళ్లి వేదికపైనే వివాహాన్ని రద్దు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.


 సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ ఇలాంటి తరహా ఘటనలు నేటి రోజుల్లో కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇలా కట్నం దాహంతో ఎంతోమంది పెళ్ళికొడుకు తరుపు కుటుంబీకులు ఊగిపోతున్న నేటి రోజుల్లో.. ఉత్తరప్రదేశ్  లో ఓ అల్లుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఏకంగా తనకు వధువు తరుపు కుటుంబ సభ్యులు ఇచ్చిన కట్నాన్ని మళ్లీ పెళ్లి వేదికపైనే తిరిగి ఇచ్చేసి అతని మంచి మనసుతో అందరి మనసు దోచేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 ఇలా ముజ్ఫర్ నగర్ కు చెందిన ఈ వరుడు చేసిన పని సమాజంలోని ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వధువు కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు అని చెప్పాలి. సౌరబ్ చౌహాన్ అనే వ్యక్తి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాడు. రిటైర్డ్  ఆర్మీ జవాన్ కూతురు ప్రిన్స్ కు అతనితో వివాహం జరిగింది. అయితే ఆచారాల్లో భాగంగా అతనికి 11 లక్షలు నగదు  ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. వాటన్నింటినీ కూడా తిరిగి ఇచ్చేసిన వరుడు కేవలం ఒక్క రూపాయి మాత్రమే కట్నంగా తీసుకున్నాడు. దీంతో అతని గొప్ప మనసు గురించి తెలుసుకొని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: