ఇటీవల కాలంలో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణాలకు అసలు గ్యారంటీ లేని పరిస్థితి నెలకొంది అన్నది మాత్రం స్పష్టం గా తెలుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్రతిరోజు వ్యాయామం చేస్తే.. పౌష్టికాహారాన్ని తీసుకుంటే  కాస్త ఎక్కువకాలం బ్రతికేయొచ్చు అని అందరూ అనుకునేవారు. ఈ క్రమం లోనే అతిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేవారు. ఇందుకోసం ఎక్కువగా ఖర్చు చేయడానికి కూడా వెనకాడే వారు కాదు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలం లో మాత్రం ప్రతిరోజు వ్యాయామం చేస్తున్న వారికి.. ఇక ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న వారికి సైతం మరణాలు సంభవిస్తున్నాయని చెప్పాలి.


 గుండె పోటు కారణంగా కేవలం క్షణాల వ్యవధి లోనే కుప్ప కూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు ఎంతో మంది. ఇలాంటివి చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ భయపడి పోతున్నారు. ఇటీవల కాలం లో ఇలాంటి తరహా ఘటనలు తరచూ వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా సడన్ గా గుండె పోటుతో మరణిస్తూ ఉండడం చూసి ప్రతి ఒక్కరిలో ప్రాణాలపై తీపి మరింత పెరిగి పోతూ ఉంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి.


 ఒక ఉపాధ్యాయురాలు ఏకంగా అకస్మాత్తుగా గుండె పోటు రావడం  తో ఒక్కసారిగా కుప్ప కూలి పోయింది. తోటి ఉపాధ్యాయులు గమనించి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. సదరు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పని చేస్తుంది తన్నీరు సునీత అనే 37 ఏళ్ల మహిళ. స్కూల్లోనే ఆఫీసులో తోటి ఉపాధ్యాయులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా చనిపోయినట్లు నిర్ధారించారు. ఇలా అప్పటివరకు సంతోషంగా ఉన్న టీచర్ ఒక్కసారిగా చనిపోవడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: