ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన దొంగతనాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటివి జరిగినప్పుడు చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒక కాస్లీ డైమండ్ నెక్లెస్ చోరీ జరిగింది. ఇంతకీ చోరీ చేసింది ఎవరో తెలుసా దొంగతనాలలో అనుభవం ఉన్నవారు కాదు.. ఏకంగా ఒక ఎలుక దొంగతనానికి పాల్పడింది.


 సాధారణంగా బంగారం షాపుల్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొన్ని ఆభరణాలను డిస్ ప్లేలలో ఉంచుతారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ షాప్ నిర్వాహకులు ఇలాగే ఒక డైమండ్ నెక్లెస్ ను డిస్ ప్లేలో పెట్టారు. కానీ ఖరీదైన నెక్లెస్ ఒక్కసారిగా మాయమైంది. అది ఎలా చోరీ జరిగింది అన్నది షాప్ సిబ్బందికి అర్థం కాలేదు. దీంతో ఇక ఓనర్ తో కలిసి సిసిటీవీ ఫుటేజీ చెక్ చేశారు సిబ్బంది. అందులో కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ కాస్లీ నెక్లెస్ ను ఎత్తుకెళ్లింది మనుషులు కాదు ఏకంగా ఒక ఎలుక.  ఈ ఘటన కేరళలోని కాసర్ గడ్ లో జరిగింది.


 అర్ధరాత్రి సమయంలో ఇక ప్రొఫెషనల్ దొంగల్లాగానే షాపులోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుక డిస్ ప్లేలో ఉంచిన నెక్లెస్ ల వద్దకు వెళ్ళింది. ఇక ఏమనిపించిందో తెలియదు కానీ టైం వేస్ట్ చేయకుండానే వెంటనే నెక్లెస్ నోటి దగ్గర పట్టుకుని అక్కడి నుంచి పరార్ అయింది.  అయితే ఇలా ఏకంగా వజ్రాల హారాన్ని ఎలుక చోరీ చేసిన వీడియోని ట్విటర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ ఎలుక ఆ డైమండ్ నెక్లెస్ చోరీ చేసి ఎవరికీ తీసుకువెళ్లిందో అనే ఈ వీడియోకు క్యాప్షన్ ఇవ్వటం కూడా..  వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే వస్తుంది కదా అందుకే లవర్ కోసమే ఆ ఎలుక ఇక డైమండ్ నెక్లెస్ చోరీ చేసి ఉంటుందని నెటిజెన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: