ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సినిమాల ప్రభావం ప్రేక్షకులపై మరి ఇంత ఎక్కువగా ఉందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎందుకంటే సినిమాల్లో చూపించినట్లుగానే నిజజీవితంలోనూ నేరాలకు పాల్పడేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారు. గతంలో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చూపించినట్లుగానే ఇక అక్రమ రవాణాకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.  ఇటీవల అజిత్ తెగింపు సినిమాలో చూపించినట్లుగానే కొంతమంది బ్యాంకు దోపిడీ చేసేందుకు ప్రయత్నించడం లాంటి ఘటనలు కూడా అందరిని అవాక్కేలా చేస్తున్నాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు కూడా అజిత్ తెగింపు సినిమా ప్రభావంతో ఒక వ్యక్తి ఏకంగా బ్యాంకుకి కన్నం వేసేందుకు సిద్ధమయ్యాడు.  కానీ చివరికి అతని ప్లాన్ కాస్త బెడిసి కొట్టి కటకటాల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.  ఈ ఘటన కష్టా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. తమిళనాడులోని తిరుప్పూర్ లో కెనరా బ్యాంకులో ఈ ఘటన వెలుగు చూసింది. పాలిటెక్నిక్ చదువుతున్న సురేష్ ఈ మధ్య అజిత్ నటించిన తెగింపు సినిమా చూశాడు. అందులో ఉన్న మంచిని గమనించలేదు. కానీ ఇక బ్యాంకుకు కణం వేసే సీన్లను చూసి తెగ ఇన్స్పిరేషన్ పొందాడు.


 ఇంకేముంది వెంటనే ఆన్లైన్లో ఒక డమ్మీ గన్ ఆర్డర్ చేశాడు. ఇక ముఖానికి బుర్కా వేసుకొని బ్యాంకులోకి వెళ్ళాడు. ఇక తన దగ్గర ఉన్న డమ్మీ గన్ చూపిస్తూ కస్టమర్లను భయపడేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. అయితే అది నిజమైన గన్ అనుకొని ఇక అక్కడ ఉన్న సిబ్బంది కస్టమర్లు కూడా భయపడిపోయారు. కానీ అతని కర్మకాలీ చివరికి చేతిలో ఉన్న వెపన్ కాస్త కింద పడిపోయింది. దీంతో అతను దాన్ని తీసుకోవడానికి కిందకు వంగాడు. దీంతో అక్కడ ఉన్న ఒక పెద్దాయన ఇదే అసలైన టైం అనుకొని కండువా తీసి సురేష్ మీద వేసి చితక బాదాడు. తర్వాత పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలు కావడంతో సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: