
కర్ణాటకలో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. మధ్యమధ్యలో ఒక వ్యక్తి చేసిన పని చివరికి కుటుంబ సభ్యుల ప్రాణం పోయే పరిస్థితిని తీసుకువచ్చింది. క్యాన్సర్ బారిన పడిన భర్త తన మనికట్టు కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని కోననకుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి భార్య ఇద్దరు కూతుర్లకు ఆహారంలో విషం కలిపి చంపేశాడు. క్యాన్సర్ బారిన పడిన నాగేంద్ర కూడా ఆ తర్వాత మణికట్టు కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇక స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించడంతో చికిత్స తీసుకుంటున్నాడు.
నాగేంద్రకు క్యాన్సర్ సోకినట్లు టెస్టుల్లో నిర్ధారణ కావడంతో అతని భార్య విజయలక్ష్మి ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంది. అయితే క్యాన్సర్ బారిన పడ్డాను అన్న బాధతో కొన్ని రోజులకే నాగేంద్ర మద్యానికి బానిస అయ్యాడు. ఇక తరచూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇక ఇటీవల మరోసారి భార్య విజయలక్ష్మితో గొడవపడ్డాడు. అనంతరం ఒకవైపు మద్యం మత్తు మరో వైపు కోపంతో విచక్షణ కోల్పోయి ఆహారంలో విషం కలిపి భార్య ఇద్దరు కూతుర్లకు వడ్డించాడు. చివరికి అది తిన్న వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.