నేటి రోజుల్లో వెలుగు లోకి  వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత మానవత్వం ఉన్న మనిషి అసలు మనిషి  లాగే ప్రవర్తించడం లేదే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సాటి మనుషుల విషయం లో జాలీ దయ చూపించి మానవత్వం తో మెలగాల్సిన మనిషి ఇక ఇప్పుడు సాటి మనుషుల విషయం పక్కన పెడితే సొంత వారి విషయం లో కూడా మానవత్వాన్ని చూపించ లేని పరిస్థితి నెలకొంది. వెరసి క్షణికావేషం లో విచక్షణ కోల్పోతున్న మనిషి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నాడు.


 ఇలా విచక్షణ కోల్పోయి సొంత వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని పరిస్థితులు నేటి రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. వెరసి ఇక ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు కేవలం పరాయి వ్యక్తుల నుంచి మాత్రమే ప్రాణహాని ఉందని సొంతవారు రక్షణగా నిలుస్తారని అందరూ అనుకునేవారు. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత పరాయి వాళ్ళు ఏమో కానీ సొంతవారే ప్రాణాలు తీసేస్తారేమో అని భయంతోనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.


 అత్తను కోడలు కొట్టి చంపింది. అయితే ఇందుకు గల కారణం తెలిసి మాత్రం ప్రతి ఒక్కరు ముక్కుని వేలేసుకుంటున్నారు. తమిళనాడులోని మలైకుడిపట్టిలో ఉండే సుబ్రహ్మణ్యానికి ఇటీవల ఘణ అనే మహిళతో వివాహం జరిగింది. సుబ్రహ్మణ్యం తల్లి పళ్లనీయమాల్ కోడలిని ఇటీవల టీ తీసుకురమ్మని అడిగింది. చెప్పినట్టే కోడలు కూడా టీ తీసుకొచ్చి ఇచ్చింది. అయితే టీ వేడిగా లేదని కోడలిని తిట్టింది అత్త. దీంతో కోపంతో ఊగిపోయిన కోడలు విచక్షణ కోల్పోయి ఇనుపరాడ్డుతో అత్తను కొట్టింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు వదిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: