ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే రోడ్డు నిబంధనలు పాటించాలని ఎవరి ప్రాణాలకు వారే రక్షణ కల్పించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. వాహనదారుల తీరులో  మాత్రం మార్పు రావడం లేదు. ఎంతోమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ చివరికి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఇక ఒకరి నిర్లక్ష్యం కారణంగా మరొకరి ప్రాణం పోతూ ఉంటే మరొక... మరికొన్ని సార్లు ఇక నిర్లక్ష్యంతో వారి ప్రాణాల మీదికి వారే తెచ్చుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.



 ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక వాహనాన్ని మరో వాహనం ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఇక వేగంగా ఉన్న వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడం ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నామని చెప్పాలి. ఇటీవల కేరళ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేరళకు చెందిన రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా బస్సు అదుపుతప్పి ఇక ఎదురుగా ఉన్న చర్చి గోడను కూడా బలంగా ఢీ కొట్టింది అని చెప్పాలి.  ఇక ఈ ప్రమాదంలో చర్చి గోడ కూడా పూర్తిగా దగ్ధం అయ్యింది అని చెప్పాలి .


 పతనం తిట్ట జిల్లాలోని కిజవల్లుర్ వద్ద ఈ ఘటన జరిగింది.. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు ఆర్టీసీ డ్రైవర్. అయితే ఎదురుగా వస్తున్న కారును మాత్రం గమనించలేదు. దీంతో ఇక అతివేగం లో బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. ఇక ముందు నుంచి వస్తున్న కారును బస్సు బలంగా ఢీ కొట్టింది. అయితే కారు దూరంగా ఎగిరిపడి రోడ్డు పక్కన ఆగిపోయింది. అయితే కారును తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ స్టీరింగ్ ను ఎడమవైపుకు తిప్పాడు. దీంతో రోడ్డుకు ఆనుకొని ఉన్న చర్చి కమాన్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చర్చి ఆర్చి కూడా కుప్పకూలిపోయింది అని చెప్పాలి. ఇక పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: