భార్యా భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. అంతేకాదు ఇక కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. అయితే ఇప్పటి భార్యాభర్తల్లో మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. దాంపత్య బంధం లోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటూ సర్దుకు పోయి బ్రతకాల్సింది పోయి.. ఈగోలకు పోయి ఇక దాంపత్య బంధాన్ని నరకప్రాయంగా మార్చుకుంటున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.



 సాధారణంగా అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరిగినప్పుడే.. ఆ బంధం మరింత బలపడుతుందని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న చిన్న గొడవలనే పెద్దదిగా మార్చుకుంటూ చివరికి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక మరి కొంతమంది విచక్షణ కోల్పోయి కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకొన్ని ఘటనల్లో ఏకంగా భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా.. కడుపున పుట్టిన పిల్లలు బలి అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో భార్యాభర్తల ఘర్షణలో చివరికి భాను అనే కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతుండగా మధ్యలో వచ్చాడు భాను. ఇక తోపుసలాటలో కింద పడటంతో తలకి బలంగా గాయమైంది. దీంతో చివరికి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీపతి కనకయ్య, స్వప్న దంపతులకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేది. అయితే ఇక భర్త పోరు తట్టుకోలేక పోయిన స్వప్న.. అదే ఊర్లో ఉండే పుట్టింటికి వెళ్ళింది. అయితే ఇటీవల అత్తారింటికి వెళ్లిన శ్రీపతి కనకయ్య భార్యను లాక్కెళ్తుండగా ఘర్షణ జరిగింది. దీంతో ఈ ఘర్షణలో మధ్యలోకి వెళ్లిన బాలుడిని నెట్టేయడంతో కింద పడి మృతి చెందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: