ఈ కాలంలో పనస పండ్లు బాగా విరివిగా లభిస్తాయి. అలాగే పనస తొనలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. ఈ పనస కాయతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు తెలుసా. ఇప్పుడు ప్రతి ఫంక్షన్ లోను పనసకాయ బిర్యానీ స్పెషల్ వంటకంలాగ మారిపోయింది. మరి మేము చెప్పే విధంగా మీరు కూడా ఒకసారి పనసకాయతో బిర్యానీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది.

కావాల్సిన పదార్ధాలు:

1 tbsp మిరియాలు

6-7 యాలకాలు

6 - 7 లవంగాలు

2 అనాసపువ్వు

దాల్చిన చెక్క కొద్దిగా

1 జాపత్రి

1 tbsp సొంపు

1 tbsp జీలకర్ర

3 బిర్యానీ ఆకులు

అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా

నూనె సరిపడా

300 gms పనసకాయ ముక్కలు పచ్చివి

1 tsp జీలకర్ర

 ఉల్లిపాయ పెద్దది- 1

4 పచ్చిమిర్చి

2 టమోటోలు

చిన్న కట్ట పుదీనా

చిన్న కట్ట కొత్తిమీర

ఉప్పు

1/2 tsp పసుపు

1.5 tsp కారం

వేడి నీళ్లు సరిపడా

1/2 cup చిలికిన పెరుగు

2.5 cups బాస్మతి బియ్యం

1/4 cup నెయ్యి

మసాలా పొడి 2 స్పూన్స్

1 నిమ్మకాయ

 తయారు చేసే విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె పోయండి అది కాగిన తరువాత పనసకాయ ముక్కలు వేసి ముక్కలు మెత్తబడి, ఎరుపు రంగు వచ్చేవరకు వేయించండి.  అవి వేగిన తర్వాత  వాటిని తీసి ఒక గిన్నెలోకి వేయండి.ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలోకి నూనె, కొద్దిగా నెయ్యి పోసి కాగిన తర్వాత  యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, జీలకర్ర వేసి వేపుకోవాలి.అవి వేగాక ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి, టొమోటో ముక్కలు, ఉప్పు వేసి వేపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కూడా వేసి వెపండి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ పోసి ఆ తరువాత వేయించుకున్న పనసకాయ ముక్కలు, చిలికిన పెరుగు, కొద్దిగా నిమ్మకాయ రసం వేసి మూత పెట్టండి. నూనె పైకి తేలే దాకా ఆ నీటిని మరగనివ్వండి.అలాగే ఆ నీటిలో కొద్దిగా మసాలా పొడి కూడా వేయాలి. నూనె పైకి కనిపించిన తరువాత నానపెట్టిన బాస్మతి బియ్యం ఒకసారి మసలాలు అన్ని కలిసేలా తిప్పి కాచిన నీళ్లు పోసి మూతపెట్టి పెద్ద మంట మీద ఉడకనివ్వాలి.ఒక 10 నిమిషాల అయ్యాక మూత తీసి కొత్తిమీర జల్లి నెయ్యి వేసి ఒకసారి తిప్పి మళ్ళీ సన్నని మంట మీద ఒక 10 నిముషాలు మగ్గనివ్వండి.   తీసుకోండి.కొద్దిగా నీటిని కింద నెల మీద పోసి బిర్యానీ గిన్నె  ఆ నీటి చుక్కల మీద పెట్టిన వెంటనే సుయ్ మంటూ సౌండ్ వస్తూ పొగలు వచ్చినప్పుడు బిర్యానీ ఉడికిపోయిందని అర్ధం. పై విధంగా పనసకాయ బిర్యానీ చేసి చూడండి. చాలా బాగుంటుంది. !

మరింత సమాచారం తెలుసుకోండి: