నేటి సమాజంలో మహిళలకు రక్షణే లేకుండా పోతోంది. దీనికి నిదర్శనమే ఒక రోజులో జరుగుతున్న ఎన్నో అరాచకాలు, హత్యాచారాలు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు అమల్లోకి తెస్తున్నా, వీటన్నింటినీ లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. కొందరు నరహంతకులు అయితే ఆఖరికి చిన్న పిల్లలను సైతం వదిలి పెట్టడం లేదు. సామాన్య మానవులే ఇలాంటి హత్యచారాలకు పాల్పడుతుంటే, నేడు జరిగిన ఒక ఘటన గురించి మీకు తెలిస్తే సిగ్గుతో తలదించుకుంటారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఒక బాధ్యత గల పోలీసు అధికారి అయి ఉండి కూడా ఒక మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కాశిమేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.

మాధవరం ఎస్సై గా పనిచేస్తున్న సతీష్ కుమార్, ఆ ప్రాంతంలోని ఒక మహిళతో కొంతకాలం పరిచయం కొనసాగించి, ఆ తరువాత ఆమె కూతురిని తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు వాడుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ఇతనికి సహకరించకపోవడంతో బెదిరింపులు మొదలు పెట్టాడు. ఆఖరికి ఆ అమ్మాయి తండ్రిని మరియు తమ్ముడిని చంపేస్తానని తన దగ్గరున్న సర్వీస్ రివాల్వర్ తో బెదిరించాడు. ఈ సంఘటనతో ఎంతో భయపడిపోయింది బాలిక తల్లి మహిళా పోలీసు వారిని ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీసులు ఎస్సై సతీష్ కుమార్ ను చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

పోలీసులు ఇతనిపై బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినందుకు గానూ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గురించి తెలిసిన చుట్టుపక్కలవారు ఇలాంటి వారికి కేసులు పెట్టడం కాదు. నడిరోడ్డుపై కాల్చి చంపాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీతో ఎవ్వరైనా తప్పుగా వ్యవహరిస్తే వారి తాట తీయాలి. ప్రభుత్వాలు ఇలాంటి పోలీసు అధికారుల మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: