ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగై పోయింది అని అర్థమవుతుంది. సాటి మనుషుల విషయంలో కాస్త అయినా జాలి చూపించకుండా  దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు అందరిని ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. తరచు ఎక్కడో ఓ చోట హత్యలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి..  ఇటీవలే నల్గొండ లో వెలుగులోకి వచ్చిన హత్య ఉదంతం అందరినీ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి చేసింది. ఏకంగా మహంకాళి అమ్మవారి విగ్రహం దగ్గర ఒక వ్యక్తి తల కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు గ్రామస్తులు. దీంతో క్షుద్రపూజల నెపంతో ఈ దారుణ హత్య జరిగి ఉంటుందని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ హత్య కాస్త చుట్టుపక్కల హాట్ టాపిక్ గా మారడంతో పోలీసులు హత్యను ఎంతో సవాల్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈహత్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక ఈ దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. సరిగ్గా రెండు రోజుల కిందట నల్గొండ జిల్లాలోని మహంకాళి మాత పాదాల వద్ద దొరికిన తల ఎవరిది అని ఇటీవలే గుర్తించారు పోలీసులు. ఇక తల కనిపించడంతో మొండెం ఎక్కడ ఉందా అని పోలీసులు వెతకడం ప్రారంభించారు.


 ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ వద్ద తల లేని మొండెం ని గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలోని కాళీ మాత పాదాల వద్ద ఉన్న వ్యక్తి తల తుర్కయాంజాల్ వద్ద  ఉన్న తల లేని మొండెం ఒక్కరిదే అని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిపై హత్య జరిగినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే మృతుడు సూర్యాపేట జిల్లాకు చెందిన జయేందర్ నాయక్ గా  గుర్తించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపిన పోలీసులు రిపోర్టులు వచ్చిన  తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామని
 తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: