ఇక ఎన్నిసార్లు భర్తతో శారీరక సంబంధం కోసం భార్య ప్రయత్నించినప్పటికీ భర్త మాత్రం నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో విసిగిపోయిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో వెలుగులోకి వచ్చింది. తన భర్త తనతో లైంగిక సంబంధం పెట్టుకోవడం లేదని అంటూ పోలీసులను ఫిర్యాదు చేసింది. కాగా సదరు మహిళకు ఏడాది క్రితమే పెళ్లయింది. ఇక అప్పటి నుంచి భర్త ఆమెకు దూరంగానే ఉంటున్నాడు. లైంగిక సంబంధం పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. అంతేకాకుండా భార్యను మానసికంగా శారీరకంగా వేధించడం కూడా మొదలు పెట్టాడు. ఎంతో కొంత కాలం పాటు భర్త వేధింపులు భరించిన భార్య ఇక మార్పు రాదు అని భావించింది. ఈ క్రమంలోనే రానురాను అతనిలో శాడిజం కూడా పెరిగిపోతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి జరిగిన నాటి నుంచి నా భర్త నాతో శారీరక సంబంధం పెట్టుకోవడం లేదని పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. సహజ పద్ధతిలో కాకుండా ఐవిఎఫ్ పద్ధతి ద్వారా బిడ్డను కనాలని వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ మన పోలీసుల ముందు చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి