ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచేసింది. ఈ క్రమంలోనే ఏపీలో మద్యం కొనడం అనేది సామాన్యులకు ఎంతో భారంగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం రవాణా ఇటీవల కాలంలో ఊహించని రీతిలో పెరిగిపోయింది. మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకునేందుకు అటు పోలీసులు తనిఖీలు చేయడం కూడా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పోలీసుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా తెలంగాణ నుంచి  అక్రమంగా తరలించేందుకు ఎంతోమంది కొత్త దారులు వెతుకుతూ వుండడం గమనార్హం.



 ఇక ఇప్పటి వరకు ఎన్నో ప్రైవేటు వాహనాలలో ఇలా అక్రమ మద్యం రవాణా చేయాలని ప్రయత్నించి చివరికి పోలీసులు తనిఖీల్లో దొరికిపోయి అక్రమార్కులు కటకటాల పాలైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ మాత్రం ప్రైవేటు వాహనంలో కాదు ఏకంగా ఆర్టీసీ బస్సులోనే దుకాణం పెట్టేసారు అక్రమార్కులు. ఏదో ఒక వాహనంలో తీసుకెళ్తే అందరికీ అనుమానం వస్తుంది. అదే ఆర్టీసీ బస్సు అయితే పోలీసులు అసలు చెక్ చేయరు అనుకున్నారో ఏమో. చివరికి ఆర్టీసీ బస్సులో ఏపీకి మద్యం సీసాలను అక్రమంగా తరలించడం ప్రయత్నించారు. కానీ చివరికి సీన్ రివర్స్ అయ్యింది.



 దాచేపల్లి మండలం పొందుగుల సరిహద్దు వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు అక్రమార్కులను పట్టుకున్నారు. గుంటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెలంగాణ నుంచి గుంటూరు వస్తుంది. వాహనాల తనిఖీలో భాగంగా పొందుగల సరిహద్దుల వద్ద దాచేపల్లి పోలీసు అధికారులు తనిఖీ చేశారు. ఇందులో మద్యం సీసాలు ఉన్నా బస్తాలను గుర్తించారు. ఇక ఇందులో ఏడు వందల ఇరవై మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే నరసరావుపేటకు చెందిన కోటేశ్వరరావు ఇక ఈ నేరానికి  పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చివరికి అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: