
మరీ ముఖ్యంగా కోపంలో లేదా బాధలో క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వారికి ఒక కూతురు పుట్టింది. దీంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎంతగానో సంతోష పడి పోయారు. కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. ఇక ఉన్నదాంట్లో సర్దుకుపోతూ సంతోషంగా జీవిస్తున్నారు. కానీ అంతలో వారి ఆనందాన్ని చూసి విధి ఓర్వలేక పోయింది. చివరికి ఇంటికి పెద్ద అయిన తండ్రిని దూరం చేసింది.
దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే తండ్రి చనిపోయిన తర్వాత తల్లికి తాను భారం కాకూడదు అనే ఉద్దేశంతో 13 ఏళ్ల బాలిక చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అల్లాదుర్గం లో వెలుగులోకి వచ్చింది. బుడగ జంగం కాలనీకి చెందిన కడమంచి సుక్కమ్మ రామస్వామి దంపతులకు కూతురు స్వప్న ఉంది. నాలుగేళ్ల క్రితం రామస్వామి మృతి చెందడంతో కూతురు స్వప్న చదువుల కోసం ఇంటిని నడిపించడం కోసం ఇక తల్లి సుక్కమ్మ ఎంతో కష్టపడి పోతుంది. ఈ క్రమంలోనే తల్లి కష్టం చూసి కూతురు మనస్తాపం చెందింది. దీంతో ఇక తల్లికి భారం కాకూడదని ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో నన్ను ఒంటరి చేసి నువ్వు కూడా వెళ్లి పోయావా అంటూ ఆ తల్లి బోరున విలపించింది..