రోజు రోజుకు ప్రముఖ నగరాల్లో వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఈ వాయువుల వల్ల చాలా మంది ప్రాణాలను కొల్పొయారు.ముఖ్యంగా ఢిల్లీ లో అయితే దారుణం..తల్లి, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఢిల్లీ లోని వసంత్ విహార్ ఏరియాలో శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. స్థానిక వసంత్ అపార్టుమెంట్‌ లో ఒక ఫ్లాట్ నుంచి పోలీసులకు సమాచారం అందింది.


ఫ్లాట్‌లో ని వాళ్లు తలుపులు తీయడం లేదని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఒక మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు కనిపించాయి. మృతుల ను మంజు, ఆమె కూతుళ్లు అన్షిక, అంకుగా గుర్తించారు. అయితే, వాళ్లు ఆత్మహత్య చేసుకున్నతీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆత్మహత్య తీరుకు సంబంధించి వాళ్లు సూసైడ్ నోట్‌ లో రాశారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఇంటిని పూర్తిగా మూసేశారు. తలుపులు, కిటికీలు అన్నీ మూసేశారు. గాలి బయటకు వెళ్లకుండా మొత్తం పాలిథీన్ కవర్లతో మూసి ఉంచారు. ఇంటిని ఒక గ్యాస్ చాంబర్‌గా మార్చుకున్నారు.



ఆ తర్వాత గ్యాస్ లోపలి నుంచి బయట కు వెళ్లకుండా చేసుకున్న తర్వాత, ఇంట్లో గ్యాస్ లీక్ చేశారు. ఆ గ్యాస్ పీల్చి, ఊపిరాడక పోవడం తో ముగ్గురూ మరణించారు. ఈ విషయం గురించి వారే స్వయంగా సూసైడ్ నోట్ లో రాసుకున్నారు.. లోపలికి వచ్చేముందు కిటికీలు, తలుపులు తెరవాలని సూచించారు. అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్త గా ఉండాలని కోరారు. పోలీసులు ముగ్గురి ఆత్మ హత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురి మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, గత ఏడాది మంజు భర్త మరణించాడని దాంతో వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: