ప్రజలందరికీ రక్షణ కల్పించేందుకు అటు పోలీసు అధికారులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఊరి పెద్దలు పరిష్కరించేవారు. కానీ ఇటీవలి కాలంలో ఊరి పెద్దలు సైతం సమస్య వస్తే పోలీసుల దగ్గరికి పరుగులు పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో అటు పోలీస్ స్టేషన్ లలో నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అటు మర్డర్ లకు కేసులకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి.


 ఇలాంటి కేసులను ఎంతో సవాలుగా తీసుకుంటున్న పోలీసులు ఎంతో చాకచక్యంగా విచారణ జరిపి ఛేదిస్తూ ఉన్నారు. అయితే  అదే సమయంలో పోలీస్ స్టేషన్ కు  కేసు పెట్టడానికి వస్తున్న కొంతమంది చెప్పే కారణాలు మాత్రం పోలీసులకే షాక్ ఇస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక మహిళ మృతి విషయంలో కేసు పెట్టడానికి వచ్చారు. కానీ  పోలీసులు మాత్రం షాక్ అయ్యారు. అదేంటి మహిళ మృతి  విషయంలో కేసు పెడితే షాక్ అవ్వడం ఎందుకు అనుకుంటున్నారు కదా. ఏకంగా బాధితులు ఒక గొర్రె పై హత్య  కేసు పెట్టడం గమనార్హం.


 ఈ ఘటన దక్షిణ సుడాన్ లో వెలుగులోకి వచ్చింది. ఒక గొర్రె దాడిచేయడంతో అదియు చాపింగ్ అనే మహిళ మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా పోలీస్ స్టేషన్ కు  చేరుకుని కేసు పెట్టారు. ఇక పోలీసులు ఊరుకుంటారా ఆ గొర్రె ను అరెస్టు చేసి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. ఇక కోర్టు అధికారులు మేమేమైనా తక్కువ అనుకున్నారో ఏమో ఏకంగా నా గొర్రె  కి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అంతేకాదండోయ్ ఆ గొర్రె యజమాని బాధిత కుటుంబ సభ్యులకు 5 ఆవులను అప్పగించాలని తీర్పునివ్వడం గమనార్హం. శిక్షా కాలం పూర్తయిన తర్వాత సదరు గొర్రెను కూడా పరిహారంగా బాధిత కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: