వివరాల్లోకి వెళితే.. శివన్ నగరానికి సమీపం లోని హర్ దోబారా గ్రామం లో ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది. అది శిథిలావస్థకు చేరుకుంది. కాగా ఇక చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ అక్కడికి చేరుకుని ఇంట్లో ఆడుకుంటున్నారు. అయితే ఇటీవలే ఆడుకుంటున్న సమయంలో పిల్లలు పొరపాటున ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళారు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఒక గదిలో పైకప్పుకు వేలాడుతున్న ఒక యువతి మృతదేహం కనిపించింది. ఇది చూసిన పిల్లలు అందరూ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పరుగులు తీస్తూ అక్కడి నుంచి పారిపోయారు.
ఏం జరిగిందని పెద్దలు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో హుటా హుటిన అక్కడికి చేరుకున్న పెద్దలు ఆ ఇంట్లో పైపుకు వేలాడుతున్న ఓ యువతి మృతదేహాన్ని కిందికి దించారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇంట్లో నుంచి అదృశ్యమైన పద్దెనిమిదేళ్ల రంజన కుమారిగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రేమ వ్యవహారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని స్థానికులు చెబుతుండగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి