ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని హృదయ విదారక ఘటనలూ మనసుని కదిలిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయ్యో దేవుడా ఇలా చేసావ్ ఎందుకు అని ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇటీవలే బీహార్ లో కూడా ఇలాంటి ఒక హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భాగల్పూర్ రైల్వే స్టేషన్ లో ఐదేళ్ల బాలుడు తన తల్లి మరణించింది అన్న విషయాన్ని తెలియక అమ్మ ఆకలి వేస్తుంది అంటూ ఏడుస్తూ ఒడిలో నిద్రపోయాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 రైల్వే ప్లాట్ ఫాం పై కన్న తల్లి చనిపోయింది. ఆ విషయం ఐదేళ్ల బాలుడు కి తెలియదు.  చివరికి అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి హాయిగా ఒడిలో నిద్రపోయాడు. కాసేపటికి నిద్రనుంచి మేలుకొని అమ్మ ఆకలి వేస్తుంది అంటూ చనిపోయిన  తల్లిని తట్టిలేపేందుకు ప్రయత్నించాడు. అయితే అమ్మ ఎంతకీ లేవకపోవడంతో చివరికి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. అయితే గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

 ఇక తల్లి చనిపోవడంతో ఎవరూ లేని ఆ చిన్నారిని శిశు సంక్షేమ కేంద్రం అధికారులకు అప్పగించారు పోలీసు అధికారులు. ఈ క్రమంలోనే ఎవరైనా సంప్రదిస్తారు ఏమో అని భావించి తల్లి కుమారుడిని ఫోటోలను పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు అని చెప్పాలి. అయితే ఎంతకీ ఎవరు ఇక స్పందించకపోవడంతో చివరికి ఆ మహిళ అంత్యక్రియలను పోలీసులు నిర్వహించారు అన్నది తెలుస్తుంది. ఇక మహిళ  మరణానికి గల కారణాలు ఏంటి అన్నది  పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తాయని అధికారులు చెప్పుకొచ్చారు.. అయితే ఈ ఘటన ప్రతి ఒక్కరిని మనసును కదిలిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: