ఇటీవల కాలంలో సినిమాల ప్రభావం జనాలపై కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. అదే సమయంలో సినిమాల్లో చూపించే మంచిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. కానీ సినిమాల్లో ఏదైనా చెడు విషయాలు చూపించారు అంటే చాలు బాగా ఆకర్షితులు అవుతున్నారు జనాలు. ఇక సినిమాల్లో లాగానే నిజ జీవితంలో కూడా కొన్ని విషయాలను ప్రయత్నిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసినవిధానాన్ని రియల్ లైఫ్ లో కూడా కొంతమంది స్మగ్లర్లు అనుసరించడం సంచలనం గా మారిపోయింది.  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 ఏకంగా దృశ్యం 2 సినిమా చూసి చివరికి హత్యకు ప్లాన్ చేసింది యువతీ. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావిలో వెలుగు చూసింది. ఏకంగా ప్రియుడుతో కలిసి తండ్రిని ఓ యువతి దారుణంగా హత్య చేసింది. అయితే ఈ హత్యకు ప్లాన్ వేయడానికి మృతుడి భార్య, కుమార్తె, ఆమె ప్రియుడు దృశ్యం సినిమాను పదిసార్లు చూసినట్లు పోలీసు విచారణలో తెలిపారు.  ఇక ఈ సినిమాలో లాగానే పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేలా హత్య చేసినట్లు పోలీస్ విచారణలో ఒప్పుకోవడంతో అటు ఖాకిలు సైతం షాక్ అయ్యారు.


 బెలగావి నగరానికి చెందిన సుదీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. దుబాయిలో పనిచేస్తూ ఉండేవాడు. కరోనా సమయంలో దుబాయ్ నుంచి సొంత ఇంటికి వచ్చి భార్య  కుమార్తెలతో ఉంటున్నాడు. కాగా కుమార్తె స్నేహ మహారాష్ట్రలోని పూణేలో  హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతుంది. కాగా అక్కడ అక్షయ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి సుధీర్ ను మందలించాడు. ఇదే విషయంపై పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. చివరికి ప్రియుడు కోసం తండ్రిని హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. విషయం తెలిసి తప్పు అని చెప్పాల్సిన  తల్లి కూడా సహకరించేందుకు ఒప్పుకుంది. ముగ్గురు దృశ్యం సినిమా చూసి అదే తరహాలో హత్య చేశారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అస్సలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరికి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: