తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. ఒకప్పుడైతే వృద్ధాప్యం వస్తేనో లేదంటే భయంకరమైన ఆరోగ్య సమస్య వస్తేనో అర్థంతరంగా ప్రాణాలు పోతాయి అందరూ భావించేవారు. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న  ఘటనలు చూసిన  తర్వాత ఏ క్షణంలో ప్రాణం గాల్లో కలిసిపోతుంది చెప్పడం కష్టమే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ఇప్పటికే ఎన్నో రకాల వైరస్ లు ముంచుకొస్తూ మనిషి ప్రాణాలు తీసేందుకు పంజా విసురుతున్నాయి.



 ఇక మరోవైపు సడెన్ హార్ట్ ఎటాక్ లు ఎంతో మంది ప్రాణాలను చూస్తూ చూస్తుండగానే గాల్లో కలిపేస్తూ ఉన్నాయి. ఇవేవీ చాలావు అన్నట్టు కొన్ని అనూహ్యమైన ఘటనలు చివరికి ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈకోవలోకి చెందినదే. నూతన వధూవరులు ఎంతో సంతోషంగా హనీమూన్ కి వెళ్లారు. కానీ వారి సంతోషాన్ని చూసి విధి అసలు ఓర్వలేకపోయింది. దీంతో ఊహించని ప్రమాదం రూపంలో చివరికి మృత్యువు కబలించేలా చేసింది. ఈ విషాదకర ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. లోకేశ్వరన్ అనే వ్యక్తి విబ్నిశియా అనే యువతిని ఈ నెల ఒకటవ తేదీన వివాహం చేసుకున్నాడు.


 వృత్తి రీత్యా ఈ ఇద్దరు కూడా డాక్టర్లే. అయితే పెళ్లి తర్వాత కొత్తజంట హనీమూన్ కు వెళ్లాలి అనుకున్నారు. ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తే.. ఇండోనేషియా మంచి ప్లేస్ అని వారికి అనిపించింది. దీంతో వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని ఇండోనేషియా కు పయనం అయ్యారు. ఇక ఈనెల తొమ్మిదవ తేదీన అక్కడ సముద్రంలో సరదాగా మోటార్ బోట్ పై విహరించారు ఈ నూతన వధూవరులు. కానీ అక్కడే వారి కోసం మృత్యువు ఎదురుచూస్తుంది అని మాత్రం ఊహించలేకపోయారు. బోటు ఒక్కసారిగా తిరగబడటంతో సముద్రంలో పడి చనిపోయారు. అయితే వధువు మృతదేహం ఇంకా లభించలేదు. ఇలా పెళ్లైన పది రోజులకే వధూవరులు ఇద్దరు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అరణ్య రోదనగా  విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: