పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఒక ప్రత్యేకమైన ఘట్టం. ఈ క్రమం లోనే నచ్చిన భాగస్వామిని జీవితం లోకి ఆహ్వానించి ఇక ప్రతి క్షణాన్ని ఎంత సంతోషంగా గడపాలని యువతి యువకులు ఇద్దరు కూడా భావిస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే కొంత మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే.. ఇంకొంత మంది పెద్దలు కుదుర్చున వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇక పెళ్లిని జీవితాంతం గుర్తుండే విధంగా ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారని చెప్పాలి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి అనేది ఎంతో ప్రత్యేకమైనది.


 కానీ కొంతమందికి మాత్రం పెళ్లి అనేది కేవలం కమర్షియల్ ఎలిమెంట్ గా మాత్రమే మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లిని ఏకంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారు చాలామంది. ఎంతోమంది మహిళలు అందాన్ని ఎరవేసి ఇక పెళ్లిళ్లు చేసుకుని చివరికి అందిన కాడికి దోచుకుపోతున్నారు. ఇక మరికొన్ని ఘటనల్లో అబ్బాయిలు మాయమాటలతో నమ్మించి ఇక నిత్య పెళ్లి కొడుకుగా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించె. అతను నిత్య పెళ్లి కొడుకు.. ఎన్ని పెళ్లి చేసుకున్నాడో తెలిస్తే అందరూ నోరెళ్ళ పెడతారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల పోలీసులకు చిక్కి చివరికి కటకటాల వెనక్కి వెళ్ళాడు. బెంగళూరుకు చెందిన 35ఏళ్ళ మహేష్ మ్యాట్రిమోనీ సైట్లలో డాక్టర్ ఇంజనీర్ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటూ 15 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల హేమలత అనే అమ్మాయిని బుట్టలో వేసుకోవాలి అనుకున్నాడు. తాను ఒక క్లినిక్ తెరిచేందుకు 70 లక్షలు కావాలని  ఒత్తిడి చేయడంతో హేమలత పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: