ఆధునిక సమాజంలో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్న మనిషి.. ప్రతి పనిని ఎంతో సులభంగా మార్చేసుకుంటున్నాడు. అయితే ఇలా మనిషి జీవితంలో వచ్చిన మార్పులు ఓకే కానీ ఎందుకో మనిషే పూర్తిగా మారిపోతూ ఉన్నాడు. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషి ఏకంగా మృగంలా మారిపోతూ చేస్తున్న పనులు అందరిని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు మనిషి. ఏకంగా అత్యాచారాలు చేస్తూ దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఆడపిల్ల ధైర్యంగా  ఇంటి నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది కామాంధులు అయితే మరింత రెచ్చిపోయి మూగజీవాలను కూడా వదలడం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా ఒక మేకపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సమీప ప్రాంతం నుంచి మేకను అనుమానాస్పదంగా తీసుకు  వెళ్ళటం చూసినా మరో వ్యక్తి అతను మేకపై దారుణానికి పాల్పడటం చూసి షాక్ అయ్యాడు.



 ఇందుకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రామానగర్ జిల్లా చిన్న పట్న నగరంలో ఈ ఘటన జరిగింది. మేకపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు డ్రైవర్ రూహిద్ అహ్మద్ గా  గుర్తించారు పోలీసులు.  అయితే ఇలా మేకపై అత్యాచారం చేస్తున్న సమయంలో సమీర్ ఖాన్ అనే వ్యక్తి తన మొబైల్ లో ఈ చర్యను రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇక పోలీసులు రంగంలోకి అరెస్టు చేశారు అని చెప్పాలి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: