తీగ లాగితే డొంక కదిలింది అనే సామెత అప్పుడప్పుడు వింటూ ఉంటామ్. అయితే కొన్ని కొన్ని ఘటనలకు ఇది సరిగ్గా సరిపోతూ ఉంటుంది. మరి ముఖ్యంగా పోలీసులు ఎవరైనా నేరస్తులను పట్టుకున్నప్పుడు చిన్న తీగ లాగితే ఇక పెద్ద స్కామ్ బయటపడినప్పుడు.. ఇలా తీగలాగితే డొంక కదిలింది అనే సామెతను వాడుతూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సోషల్ మీడియాలో తన లైఫ్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఒక కోడలు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.


 ఇటీవలే ఒక విదేశీ యువతి ప్రసవించింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే కోడలు,  మనవడిని చూసేందుకు వెళ్లిన అత్త మనవడికి కొడుకు పోలికలు రాలేదు అని అనుమాన పడింది. దీంతో ఇక తన కోడలికి పుట్టిన బిడ్డ తన కొడుకుకు పుట్టిన వాడు కాదని.. కోడలికి ఎవరితోనో వివాహేత్ర సంబంధం ఉంది అంటూ సందేహ పడింది అత్త. అంతటితో ఆగకుండా డీఎన్ఏ టెస్ట్ చేయించాలని పట్టుబట్టింది. ఇక దీనికి ఆమె కొడుకు కూడా మద్దతు పలికాడు. అయితే ఇక ఇటీవలే బలవంతం మీద సదరు యువతి డిఎన్ఏ టెస్ట్ కు అంగీకరించింది.


 ఈ క్రమంలోనే ఓ రోజు కోడలు, అత్త కలిసి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లగా.. అక్కడ కథ అనూహ్యమైన మలుపు తిరిగింది. కోడలు వ్యవహారం వెలుగు చూస్తుందనుకుంటే అత్త నిర్వాకం బయటపడింది. డిఎన్ఏ పరీక్షల్లో తన మనవడికి తండ్రి తన కొడుకే అని తేలింది. కానీ తన కొడుకుకు తండ్రి మాత్రం తన భర్త కాదు అని రిపోర్టులు రావడంతో.. ఆ అత్త చేసిన తప్పు బయటపడింది. ఎందుకంటే తనతో తన అత్త కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని కోడలు పట్టు పట్టడంతో ఇక అత్త అలాగే చేయించుకుంది. కానీ అలా తన అత్తకు పుట్టిన కొడుకు అసలు ఆమె భర్తకు  పుట్టలేదు అన్న విషయం ఇక ఆ యువతి ఈ టెస్టులో బయటపడేలా చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టును ఒక యువతి పెట్టగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: