నేటి ఆధునిక సమాజం లో ఆడ పిల్లలపై ఉన్న వివక్ష పూర్తిగా తగ్గిపోయిందా అంటే ఇక వెలుగు లోకి వచ్చే కొన్ని ఘటనల ద్వారా ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారంగా భావించేవారు తల్లిదండ్రులు. ఇక మగపిల్లాడు మాత్రమే తమకు అసలైన వారసుడు అని నమ్మేవారు. అందుకే ఆడపిల్ల పుడితే ఏకంగా చెత్తకుప్పల్లో పడేసిన ఘటనలు ఇప్పటివరకు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి. ఇక కొంతమంది భార్యాభర్తలు అయితే ఆడపిల్ల పుట్టాలని నోములు వ్రతాలు చేయడం కూడా నేటి ఆధునిక సమాజంలో చూస్తూ ఉన్నామ్. ఆడపిల్ల పుట్టిందంటే అదృష్ట లక్ష్మి ఇంటికి నడిచి వచ్చింది అని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు ఎంతోమంది పేరెంట్స్. కానీ ఇంకా అక్కడక్కడ ఆడపిల్ల కాదు మగపిల్లాడే కావాలని పట్టుబడుతున్న మనుషులు కూడా కనిపిస్తున్నారు. మగపిల్లాడు పుట్టలేదు అన్న కారణంతో ఇక కొంతమంది ఎంతో క్రూరత్వంతో ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వెంకటాయపల్లికి చెందిన సత్యనారాయణ అనే 26 ఏళ్ళ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


 స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్ కు చెందిన కవితతో సత్యనారాయణకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇక మగపిల్లాడు పుట్టలేదని ఎప్పుడూ సత్యనారాయణ బాధపడుతూ ఉండేవాడు. ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇక ఇదే విషయంపై బాగా ఆలోచించిన సత్యనారాయణ మనస్తాపం చెందాడు. దీంతో పురుగుల మందు తాగాడు. అయితే స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా.. చివరికి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: