
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వ్యాపార కుటుంబానికి చెందిన రాజా రఘువంశీకి, సోనమ్‌తో మే 11న వివాహం జరిగింది. మే 20న ఈ నూతన జంట హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 23న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు మిస్ అయ్యారు. కమ్యునికేషన్ కట్ అవ్వడంతో కంగారు పడ్డ ఫ్యామిలీ మెంబర్స్ తో పోలీసులు ఫిర్యాదు చేశారు. అప్పటినుండి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ టీమ్ మిస్ అయిన జంట కోసం గాలిస్తూనే ఉన్నారు. దాదాపు 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతని శరీరంలో కత్తి గాయాలు ఉండటంతో హత్యగా అనుమానించారు.
అయితే సోనమ్ ఏమైపోయిందో తెలియకపోవడంతో కేసు మిస్టరీగా మారిపోయింది. ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. కనిపించకుండా పోయిన సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసులకు లొంగిపోయింది. ఆమెను విచారించగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే సోనమ్.. రాజా రఘువంశీని చంపాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా సుపారీ ఇచ్చి ముగ్గురు కిరాయి హంతకులను నియమించి పక్కా ప్లానింగ్ తో భర్తను చంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దారుణమైన కుట్రను చేధించిన మేఘాలయ పోలీసులు సోనమ్ తో పాటుగా రాజా రఘువంశీ హత్యకు సహకరించిన ముగ్గురు కిరాయి హంతకులను కూడా ఇండోర్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.