మా బిడ్డ చనిపోయింది.. మీకు ఇచ్చినటు వంటి వరకట్నం మాకు మళ్ళీ తిరిగి ఇవ్వడంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన ఘటన రామ కృష్ణాపూర్ పట్టణం లో చోటు చేసుకుంది.. రామ కృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్ నగర్ కి చెందినటువంటి సింగరేణి కార్మికుడు ముద్రసాని సురేష్ పెండ్లి అదే పట్టణానికి చెందినటు వంటి లావణ్య 29 తో నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది.. కొన్నాళ్ల పాటు బాగానే జీవించిన ఈ జంట మధ్య ఏం పుట్టిందో ఏమో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసుగు చెందిన లావణ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. 

ఇదే సమయం లో  గత కొన్ని రోజుల కింద తన తండ్రి సత్యం తో కలిసి  వెళ్తున్న సమయం లో లావణ్య కి అప్పన్నపేట స్టేజి వద్ద  రోడ్డు ప్రమాదం అయింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా  లావణ్య తీవ్ర గాయాల పాలయ్యింది. దీంతో స్థానికులు ఆమెను హైదరాబాదులోని పెద్ద ఆసుపత్రికి తరలించారు. కానీ లావణ్య చికిత్స పొందుతూ మరణించింది. అయితే లావణ్య మృదేహాన్ని లావణ్య తరుపు బంధువులు  తన భర్త సురేష్ ఇంటి ముందుకి తీసుకువచ్చి ఇంటి ముందు వేశారు. మేము ఇచ్చిన వరకట్నం తిరిగి ఇస్తేనే మృతదేహాన్ని తీస్తామని చెప్పారు.

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇరు కుటుంబాలను వారించారు. అంతే కాదు లావణ్య మృతదేహాన్ని ఆర్కేపి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా మృతదేహం అంబులెన్స్ లోనే ఉంది.ఆ తర్వాత పోలీసులు కలగజేసుకొని, ఏదైనా ఉంటే మేము తర్వాత మాట్లాడతాం మృతదేహాన్ని తీసుకెళ్లి దహనం చేయండి అంటూ  చెప్పారు. చివరికి బాధిత కుటుంబ సభ్యులు  ఉదయాన్నే పెద్దపల్లి జిల్లా ఓదెలకు తీసుకెళ్లి  అంత్యక్రియలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: