భారత్ తో సత్సంబంధాలు కొనసాగించడం మాకెంతో అవసరం. అంతర్జాతీయంగా భారత్ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గమనిస్తూనే ఉన్నాం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. ఇండో ఫసిఫిక్ స్ట్రాటజీలో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తోంది.  అందుకే భారత్ తో బంధాన్ని బలోపేతం చేయాలని చూస్తున్నాం. కానీ ఇదే సమయంలో నిజ్జర్ హత్య విషయంలో చట్ట ప్రకారం ఆ దేశం సహకరించాలి అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ ప్రెస్ కాన్ఫ్రెన్స్ లో మాట్లాడారు.
 

సాధారణంగా హత్యలు రెండు రకాలు ఉంటాయి. తీవ్రవాదులను మట్టు బెట్టడానికి.. ఒక దేశపు శత్రువును చంపించడం కోసం ప్రణాళిక రచించి హతమారుస్తుంటారు. వీళ్లను చంపడమే లక్ష్యంగా పథకాన్ని రచిస్తుంటారు. మరోకటి ప్రతీకార హత్య.  తమకు నష్టం కలిగించిన వారిని ఎలాగైనా ఎక్కడ ఉన్నా చంపాలని కోవడం. తాజాగా భారత్ పై ద్వేషంతో రాసిన వాషింగ్టన్ కథనం ఇప్పుడు మనకే అనుకూలంగా ఉంది. భారత్ దేశానికి శత్రువు అయి కెనడాలోని గురుద్వార్ లో తలదాచుకుంటున్న నిజ్జర్ బయటకు వెళ్లేందుకు ఓ వాహనాన్ని తీశాడు.


ఇంతలోనే కారులో వచ్చిన ఓ ముఠా అతడిని మట్టుబెట్టి తిరిగి వెళ్లిపోయినట్లు ఓ సీసీ టీవీ పుటేజ్ లో నిక్షిప్తం అయింది. ఇది తాజాగా బయటపడింది. నిజ్జర్ ను హత్య చేసేందుకు వచ్చిన ముగ్గురిలో ఏకంగా ఒకరు 50 బుల్లెట్లను అతని శరీరంలోకి దింపాడు. తలలో బుల్లెట్ దింపడమే కాకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అందులో 34 అతని శరీరంలోకి చొచ్చుకొని పోయాయి.  ఈ కథనంతో ఇది ప్రతీకార దాడి.. దేశపు కుట్ర కాదని చెప్పడానికి భారత్ కు ఓ అవకాశం లభించినట్లయింది. పంజాబ్ లో ఉన్న నిజ్జర్ గ్రూపు, కెనడాలో ఉన్నటువంటి గ్రూపు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పంజాబ్‌లో చంపబడిన సిక్కు గాయకుడికి ప్రతీకారమే నిజ్జర్ హత్యగా పలువురు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: