
ముఖ్యంగా ఎవరికీ వారే ఆస్తిగా భూమి ఉంటుంది. అయితే టిడ్కో ఇళ్లలో అయిదు లేదా ఆరు అంతస్థుల్లో ఉండేలా చేశారు. కానీ జగన్ ఇవ్వబోయే ఈ ఇండ్ల స్థలాలు ఎవరికి వారివే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అవే టిడ్కో ఇళ్లు ఇచ్చి ఉంటే అభిమానం చాటే వారు. జగన్ సర్కారు వచ్చాక టోటల్ 31 లక్షల ఇండ్లు అన్నారు. అయితే అందులో కేవలం 15 లక్షల వరకు అనౌన్స్ చేశారు. అందులో మూడు లక్షల ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి.
సామర్లకోటలో 2000 వేల పై చిలుకు ఇళ్లు ఇస్తామని వైసీపీ చెబుతున్నారు. 2 వేల మంది పేదలు సొంతిళ్లకు వెళితే అక్కడ ఉండే సంతోషమే వేరు. దాన్ని వైసీపీ వారు ప్రొజెక్టు చేయనున్నారు. అయితేే ప్రతి పేద వాడి కల ఇండ్లు తీసుకోవడం. కానీ ఈ ఇండ్లను తీసుకోవడం కోసం వారు ఎంతగానో వేడుకుంటారు. కలలు కంటారు. కానీ వాటిని ఆయా ప్రభుత్వాలు ఇస్తున్నామని చెప్పి ఆశ చూపి వాటిని ఇవ్వకుండా జాప్యం చేస్తుంటాయి.
అయితే జగన్ సామర్లకోటలో 2 వేలకు పైగా ఇళ్లను ఇవ్వనుండటంతో పేదవారి కల నెరవేరనుంది. ఈ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో ఇండ్లను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా మంచి మార్కులు కొట్టేసేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది.