మూడు రాజధానుల వివాదంపై జరుగుతున్న విచారణలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాకు షాక్ కొట్టినట్లే చెప్పాలి. ఇప్పటివరకు చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన పై తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే అని ఒకటే యాగీ చేస్తున్నారు. పార్లమెంటు ద్వారా రాష్ట్ర విభజన చట్టంలో సవరణలు చేయాలని, రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత కానీ మూడు రాజధానులు ఏర్పడవని ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా బల్లగుద్ది మరీ చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చెబుతున్నదేమంటే జగన్ ప్రయత్నం ఫెయిలవుతుందని. అయితే హైకోర్టు విచారణలో భాగంగా ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ తో ప్రతిపక్షాలకు, ఎల్లోమీడియాకు ఇపుడు నోట మాట రావటం లేదు.




ఇంతకీ అఫిడవిట్లో ఏముందంటే అసలు రాష్ట్ర విభజన చట్టమే అమల్లో లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం  ఏపికి ప్రత్యేకహోదా రావాలి. హోదాను తుంగలోతొక్కడం ద్వారా కేంద్రమే రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లు రాష్ట్రప్రభుత్వం తన అఫిడవిట్లో స్పష్టంగా చెప్పింది. దీన్ని కాదనేందుకు ఎవరికీ అవకాశం లేదు. ఇక మిగిలిన విషయాలను చూస్తే వైజాగ్ కు ప్రత్యేక రైల్వేజోన్ కేటాయించింది రాష్ట్ర విభజన చట్టం. మరి వైజాగ్ కు ప్రత్యేక రైల్వే చట్టం కేంద్రం ఇవ్వలేదు కదా, ఏమైంది ? అంటే ఇక్కడ కూడా విభజన చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించినట్లే అయ్యింది. ఇక పోలవరం ప్రాజెక్టు విషయాన్ని చూద్దాం. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా దక్కింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన పరిధిలోకి ఎలా తీసుకున్నాడు ? అంటే ఇక్కడ చంద్రబాబు కూడా చట్టాన్ని ఉల్లంఘించినట్లే.




రాష్ట్ర విభజన చట్టంలో  చంద్రబాబు ఉల్లంఘించిన మిగిలిన అంశాలు చూద్దాం.  చట్ట ప్రకారం పదేళ్ళు హైదరాబాద్ ఏపి, తెలంగాణాకు ఉమ్మడి రాజధాని. మరి ఎన్నికలు జరిగిన ఏడాదిలోనే ఎవరినడిగి చంద్రబాబు హైదరాబాద్ పై హక్కులను వదులుకుని విజయవాడకు పారిపోయొచ్చాడు ? ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పటమేంటి ? అందుకు చంద్రబాబు తలూపటమేంటి ? రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏపికి రావాల్సిన   ప్రత్యేకహోదాను చంద్రబాబు ఎవరినడిగి వదులుకున్నాడు ? హోదా వద్దని చంద్రబాబు చెప్పేముందు రాష్ట్రంలోని మిగిలిన ప్రతిపక్షాల అభిప్రాయాలను, అడిగాడా ?  ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని కేంద్రం చెబితే ఏకపక్షంగా చంద్రబాబు ఎలా సమ్మతించాడు ?  ప్రతిపక్షాలను కానీ, జనాభిప్రాయాలను కానీ  చంద్రబాబు ఎందుకు తీసుకోలేదు ?




కేంద్రం, చంద్రబాబు చేసిన తప్పులనే ఇపుడు జగన్ తనకు అడ్వాంటేజ్ గా మలచుకున్నాడని అర్ధమైపోతోంది. ప్రపంచస్ధాయి రాజధాని అని, సింగపూర్ కన్సార్షియం అని ఏవోవే కలలు కని చివరకు అమారవతిని చంద్రబాబు భ్రమరావతిగా మార్చేశాడు. పిండికొద్ది రొట్టె అన్నపద్దతిలో  కాకుండా  ఏకంగా స్వర్గానికే నిచ్చెనెలు వేద్దామని అత్యాసకుపోయి బోల్తాపడ్డాడు. దాంతో అధికారంలోకి వచ్చిన జగన్ రాజధానిగా వైజాగ్ ను ప్రతిపాదించి అందుకు తగ్గట్లే పావులు కదుపుతున్నాడు. దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నాడు.  రెండు రోజులకోసారి  జూమ్ యాప్ లో వచ్చి జనాల బుర్రలు తింటున్నాడు. నోటికొచ్చినట్లు మాట్లాడి జనాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అది సాధ్యం కాకపోవటంతో చివరకు జగన్ పై తిరిగబడమని జనాలను బ్రతిమలాడుకుంటున్నాడు. మొత్తానికి ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ తో చంద్రబాబు, ఎల్లోమీడియా నోళ్ళు మూతపడతాయా ? చూద్దాం ఏమవుతుందో .




మరింత సమాచారం తెలుసుకోండి: