అవును ఆదివారం రాసిన చెత్తపలుకులో ఎల్లోమీడియా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సత్తా ఏమిటో చెప్పేసింది. చంద్రబాబునాయుడుకు దొంగదెబ్బ తప్ప ప్రత్యర్ధిని నేరుగా ఎదుర్కొనే దమ్ములేదని నిర్మొహమాటంగా చెప్పేసింది. చెత్తపలుకులో ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై విషయం చిమ్మింది. దేవాలయాలపై దాడులు చేయటం ద్వారా ప్రతిపక్షాలు గెరిల్లా తరహా దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమధ్య జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. జగన్ ఉద్దేశ్యమేమిటంటే అర్ధరాత్రుళ్ళు, చీకట్లో ఊర్లకు దూరంగా ఉన్న, కొండలపైన ఉన్న దేవాలయాలపై ప్రతిపక్షాలు దాడులు చేయిస్తున్నట్లు ఆరోపించారు. దాన్ని అడ్డంపెట్టుకుని ఎల్లోమీడియా ఎండి వేమూరి రాధాకృష్ణ చెత్తపలుకులో చంద్రబాబు సామర్ధ్యం ఏమిటో చెప్పేశారు.




శాసనసభలో 151 మంది శాసనసభ్యుల బలంతో తిరుగులేని అధికారాన్ని సంపాదించుకున్న జగన్ పై ఎవరైనా గెరిల్లా తరహా యుద్ధమే చేయాలట. గెరిల్లా తరహా యుద్ధం ఎందుకంటే నేరుగా పోరాటం చేయటానికి ప్రతిపక్షాలకు బలం లేదని ఎల్లోమీడియా తెగ బాధపడిపోయింది. నిర్వీర్యమైపోయిన వివిధ పాలనా వ్యవస్ధలు పాలకులకు పాలేర్లుగా మారిపోయాయట. వ్యవస్ధలను తనకు పాలేర్లుగా మార్చుకోవటంలో చంద్రబాబును మించిన వాళ్ళు లేరనే ప్రచారం అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా తగుదునమ్మా అంటూ న్యాయవ్యవస్ధలో తనకున్న పట్టు ఆధారంగా ప్రభుత్వాన్ని కోర్టుల ద్వారా చంద్రబాబు గబ్బు పట్టిస్తున్నారని జనాలు అనుకుంటున్నారంటే అది వాళ్ళ తప్పెలావుతుంది. పైగా మెజారిటి మీడియాను జగన్ గుప్పిట్లో పెట్టుకున్నాడంటూ ఏడుపొకటి. మీడియాలో మెజారిటి మీడియా యాజమాన్యాలు ఎవరికి మద్దతుగా నిలబడ్డాయో ఎవరినడిగానా చెబుతారు. నిజంగానే మెజారిటి మీడియాను గుప్పిట్లో పెట్టుకునేంత తెలివి జగన్ కు ఉండుంటే కత వేరుగా ఉండేది.




హిందువుల ఓట్లకోసం బీజేపీ, టీడీపీకి పోటిపడుతున్న కారణంగా జగన్ కూడా బొట్టుపెట్టుకుని, పంచె కట్టుకుని గోపూజలు చేసినట్లు ఎల్లోమీడియా చెప్పటమే విచిత్రంగా ఉంది. జగన్ కు మొన్నటి ఎన్నికల్లో క్రిస్తియన్లు మాత్రమే కాదు ముస్లిం మైనారిటిలతో పాటు హిందువులు కూడా మద్దతుగా నిలవబట్టే 151 సీట్లతో అఖండ విజయం సాధ్యమైంది. ఆ విజయాన్ని చూసి తట్టుకోలేకే చంద్రబాబు+ఎల్లోమీడియా హిందువుల నుండి జగన్ను వేరు చేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ప్రతి చిన్న విషయానికి జగన్ క్రిస్తియన్ అని, హిందువ్యతిరేకి అంటూ ప్రతిరోజు ఆరోపణలతో బురదచల్లుతున్నది. సరే వీటన్నింటికీ తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక సమాధానం చెబుతుందనే అనుకుంటున్నారు అందరు. అప్పటివరకు జగన్ పై ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు ఇలా ఏడుస్తునే ఉంటారనటంలో సందేహంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: