ఇదే విషయం ఎవరికీ అర్ధం కావటంలేదు. హైదరాబాద్ లోనో లేకపోతే అమరావతిలో కూర్చున్నవాడు కూర్చోకుండా హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వీళ్ళకు మద్దతుగా ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు కూడా రోడ్లపైకి వచ్చేశారు. నాలుగు రోజులుగా వైజాగ్ లో గట్టిగానే ఆందోళన జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే పవన్ ఢిల్లీకి బయలుదేరారు. ఇంకేముంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం ఆగిపోతుందన్నట్లుగా జనసైనికులు ఒకటే ఊదరగొట్టారు. అయితే చివరకు ఢిల్లీకి వెళ్ళి ఏమి సాధించారు ?




ఏమి సాధించారంటే హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారంతే. పవన్ వెళ్ళినందువల్ల ఏమవుతుంది అంటే ఏమీ కాదని అందరికీ తెలుసు. రెండు రోజులు కూర్చున్నా ప్రధానమంత్రి అపాయిట్మెంట్ దొరక్కపోవటంతో తిరిగి వచ్చేశారు. ఎలాగూ ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి సాధించింది కూడా ఏమీలేదు కాబట్టి చివరకు జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేశారు. ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేని జనసేన ఇంత సాధించినపుడు 22 మంది ఎంపిలున్నపుడు జగన్ ఎంత సాధించవచ్చనే పిచ్చి ప్రశ్నొకటి సంధించారు. అప్పటికేదో ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తో భేటీ అవ్వటంతోనే విశాఖ ఉక్కు ప్రైవేటుపరం ప్రక్రియకు బ్రేకులు పడినట్లు ఫీలైపోయారు.




ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం సమస్య మొదలయ్యిందే చంద్రబాబునాయుడు హయాంలో. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయం జరిగిపోయింది. అప్పుడు ఈ విషయాన్ని చంద్రబాబు కావాలనే బయటపెట్టలేదు. అప్పుడు తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంవోయు రూపంలో అమల్లోకి వస్తోంది. అంటే ‘ఉక్కు’ పాపంలో చంద్రబాబు, జగన్ ఇద్దరికీ సమాన వాటా ఉంది. కానీ పవన్ మాత్రం విచిత్రంగా చంద్రబాబును వదిలిపెట్టేసి జగన్ను మాత్రమే టార్గెట్ చేశారు. ఇక్కడే తెలిసిపోయింది పవన్ ఢిల్లీ టూర్ ఆంతర్యమేమిటో ?

మరింత సమాచారం తెలుసుకోండి: