ఇక తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గత నెల రోజుల నుంచి శుభవార్తల మీద శుభవార్తలు చెప్తూనే ఉంది.అలాగే ఎన్నో రోజులుగా ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగులకు ఇటీవలే పోలీసు, గ్రూప్ 1 ఇంకా అలాగే విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసి ఇంకా అలాగే నిరుద్యోగులు తమ కళను సాకారం చేసుకునే అవకాశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించడం జరిగింది.ఇక ఈ క్రమంలో శుక్రవారం నాడు కేసీఆర్ సర్కార్ డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక చక్కటి తీపికబురుని చెప్పింది. అగ్నిమాపక శాఖలో ఖాళీగా 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు ప్రకటనని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21 వ తేదీ నుంచి మే 26 వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఆల్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.



ఇక ఈ డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు.. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఇక అలాగే అభ్యర్థుల వయసు విషయానికొస్తే.. జులై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని ఇంకా అలాగే గరిష్ట వయోపరిమితి వచ్చేసి వారికి అయిదేళ్లు పెంచుతున్నట్లు అధికారులు పేర్కొనడం జరిగింది. ఇక అభ్యర్థులు.. www.tslprb.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను ఉంచామని ఇంకా మే 21వ తేదీ 8 గంటల నుంచి దరఖాస్తులను చేసుకోవచ్చని సూచించడం జరిగింది.ఇక వీరి లైసెన్స్ విషయానికొస్తే..నోటిషికేషన్ తేదీ నాటికి రెండేళ్లు ఖచ్చితంగా ఉండాలి. అలాగే అంతకంటే ముందు హెవీ మోటర్ వెహికిల్ లైసెన్స్ పొంది ఉండాలని ఇంకా రిజర్వేషన్, తదితర పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు.కాబట్టి ఈ పోస్టులకు ఆసక్తి ఇంకా అలాగే అర్హత వున్న అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: